Viral news: అందాన్ని తెచ్చిపెట్టిన అరుదైన వ్యాధి.. దాని పేరేంటో తెలుసా?

Updated on: July 28, 2022

Viral news: వ్యాధి.. ఈ పేరు వింటేనే చాలా మంది భయపడుతుంటారు. అది తమకు సోకినా, తమ ఇంట్లో వాళ్లకి సోకినా చాలా బాధ పడుతుంటారు. కానీ ఆ పాపకి సోకిన వ్యాధి మాత్రం నెటిజెన్లను తెగ ఆనందపరుస్తోంది. అదేంటీ అలా ఎందుకు అనుకుంటున్నారా… అవునండి. ఎందుకంటే ఆ పాపకు సోకిన వ్యాధి వల్ల మరింత అందంగా తయారైంది. చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి అయిన అన్ కాంబెబుల్ హెయిర్ సిండ్రోమ్. ఈ వ్యాధితో బాధపడేవారు ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే. ఉంటారు. కానీ అదే వ్యాధి ఇద్దరు చిన్నారులకు మరింత ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం వీరు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారారు.

2021లో డేవిడ్ అనే బాలుడు యూహెచ్ఎస్ వ్యాధితో జన్మించాడు. దీని వల్ల అతడి పొడవాటి కాపర్ కలర్ జుట్టుతో పుట్టాడు. ఆ బాలుడిని తీస్కొని తల్లిదండ్రులు బయటకు వెళ్తే.. అందరూ అతడిని వింతగా చూసేవాళ్లు. తాజాగా ఇదే వ్యాధితో పుట్టిన మరో చిన్నారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెండి రంగులో జుట్టంతా గజిబిజిగా ఉంది. దువ్వుదామంటే కనీసం దువ్వెన కూడా పెట్టేందుకు వీలుండదు. లైలా ఫొటోలు, వీడియోలను ఆమె తల్లి షార్లెట్ అన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అవి వైరల్ గా మారాయి. అమ్మాయి చాలా బాగుందంటూ విపరీతమైన లైకులు, కామెంట్లు, వ్యూస్ వస్తున్నాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel