Divorce First Night : శోభనం రోజే విడాకులు కోరిన వరుడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Updated on: April 8, 2022

Divorce First Night : పెళ్లి చూపుల్లో చూసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరుకుటుంబాల ఇష్టంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఫస్ట్ నైట్ రోజున.. వారి జీవితాల్లో జరిగిన ముఖ్య విషయాల గురించి చర్చించుకున్నారు. అయితే అమ్మాయి తనకు సంబంధించిన ఓ చేదు నిజాన్ని వరుడికి చెప్పింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ అబ్బాయి.. వధువు నోటి నుంచి ఆ మాటలు రాగానే నాకు విడాకులు కావాలని కోరాడు. అసలు ఆమె చెప్పిన విషయమేంటి, అదెక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన యువతీ, యువకులకు పెళ్లి జరిగింది. అయితే శోభనం గదిలో తన భర్తతో… తనపై గతంలో అత్యాచారం జరిగిందని తెలిపింది. అతనెవరో కాదు తన మేనమామ కొడుకే ఈ పని చేశాడని బావురుమంది. అది విన్న వరుడు మరుసటి రోజు ఉదయమే… అమ్మాయిని పుట్టింట్లో వదిలేశాడు. విడాకులు కావాలని తెగేసి చెప్పాడు. అయితే గత మూడేళ్లుగా విచారణ సాగిన ఈ కేసులో తాజాగా విడాకులు పొందాడు వరుడు. అయితే తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై వధువు పిర్యాదు చేసింది.

Read Also : New traffic Rules : హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel