Karthika Deepam Dec 2 Today Episode : మోనిత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయిన సౌందర్య.. కార్తీక్, దీపల కోసం వెతుకుతున్న ఇంద్రుడు?

Updated on: December 8, 2022

Karthika Deepam Dec 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప హాస్పిటల్ లో సౌర్య గురించి అందరిని అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప పడిపోతూ ఉండగా కార్తీక్ అక్కడికి వచ్చి పట్టుకుంటాడు.

ఏంటిది దీప నేను నిన్ను లోపలే ఉండమని చెప్పాను కదా ఎందుకు బయటకు వచ్చావు అని అనగా బయటికి వెళ్ళొద్దన్నారు కదా డాక్టర్ బాబు ఇక్కడికి కూడా రాకూడదా అని అనగా ఇక్కడ కూడా రాకూడదు అసలు నువ్వు గది దాటి బయటకు రాకూడదు ఆపరేషన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత డాక్టర్ అక్కడికి రావడంతో ఏం జరిగింది డాక్టర్ అని అడగగా నేను వచ్చేసరికి దీప బయట ఉంది కనీసం మీరైనా చూసుకోవాలి కదా అని అనగా నర్సుని పెట్టాను కానీ ఆమె ఎక్కడికో వెళ్లినట్టు ఉంది అని అంటుంది ఆ డాక్టర్.

Karthika Deepam Dec 2 Today Episode
Karthika Deepam Dec 2 Today Episode

అప్పుడు కార్తీక్ దీపకి నచ్చజెప్పి లోపలికి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు మోనిత టెన్షన్ పడుతూ ఈ కార్తీక్,దీప ఇద్దరూ ఎక్కడికి వెళ్లి ఉంటారు నేను ఇక్కడికి వచ్చేసాను కదా అక్కడికి ఏమైనా వచ్చి ఉంటారా తెలుసుకుందాము అనుకుంటే ఈ ఆంటీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది పోనీ ఫోన్ చేద్దామనుకుంటే బయటకు వెళ్లడానికి కూడా నాకు అనుమతి ఇవ్వడం లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే సౌందర్య అక్కడికి వచ్చి ఏంటే కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు అని అనగా మరి ఏం చేయాలి ఆంటీ నన్ను తీసుకొచ్చి ఈ నాలుగు గోడల మధ్యలో వేశారు ఏం చేయాలో అర్థం కావడం లేదు పిచ్చి పడుతుంది అని అంటుంది.

Advertisement

అప్పుడు సౌందర్యఏం చేయాలో తెలియకపోవడం ఏమిటి అంట్లు కడుగు వంట చెయ్యి ఇల్లు తుడువు అని అనగా నేను వంట చేయడం అంట్లు కడగడం ఏంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటుంది మోనిత. ఇంతలోనే ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఎవరి సౌందర్య ఈ అమ్మాయి అని అడగడంతో ఈ ఇంటి కోడల్ని ఆంటీ నా భర్త చనిపోయాడు కదా మా అత్తయ్య మావయ్య నన్ను ఆశ్రయించారు. వారికి సేవలు చేస్తూ బతికేద్దాం అనుకుంటున్నాను అని అనగా వెంటనే ఆమె మీ కోడలు ఎంత మంచి సౌందర్య అని అంటుంది.. ఆంటీ కూర్చొండి నేను వెళ్లి భోజనం చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్తుంది మోనిత.

Karthika Deepam Dec 2 Today Episode : ఆపరేషన్ జరిగేటప్పుడు కార్తీక్‌ను ఎక్కడికి వెళ్లొద్దన్న దీప..

అప్పుడు ఇంటి కోడలివి అని బిల్డప్ ఇస్తావు కదా నీ సంగతి మళ్ళీ చెబుతాను అనుకుంటూ ఉంటుంది సౌందర్య. మరొకవైపు దీప కీ ఆపరేషన్ చేయడానికి అన్ని సిద్ధం చేయగా అప్పుడు దీప డాక్టర్ బాబు నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అని అనగా పక్కనే ఉన్న డాక్టర్ ఎక్కడికి వెళ్లడం లేదు మీ డాక్టర్ బాబు ఇక్కడే ఉంటాడు అని అంటుంది డాక్టర్. అప్పుడు దీప శౌర్య గురించి ఆలోచిస్తూ తన బిపి లెవెల్స్ అమాంతం పెరిగిపోవడంతో డాక్టర్స్ కొద్దిసేపు మీరు బయటకు వెళ్ళండి అని కార్తీక్ దీపకి నచ్చడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కార్తీక్ నీకు ఒక విషయం చెప్పాలి దీప నీ దగ్గర ఒక నిజం దాచాను.

గతం గుర్తుకు వచ్చింది అని అసలు విషయం చెప్పగా అప్పటికే దీప నిద్రపోయి ఉంటుంది. ఇంతలో డాక్టర్స్ అక్కడికి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెడతారు. మరొకవైపు ఇంద్రుడు దీప కార్తిక్ ల కోసం వెతుకుతూ ఎక్కడ ఉన్నారు సార్ మేము పాపని ఇవ్వకూడదు అనుకున్నప్పుడు కనిపించారు ఇప్పుడు వెతుకుతున్న కనపడటం లేదు ఒక్కసారి కనపడండి మీ అమ్మాయిని మీకు ఇచ్చేస్తాము అని ఎమోషన్ గా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. ఆ తర్వాత దీపకి ఆపరేషన్ పూర్తవ్వడంతో డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దీపకీ మెలకువ వస్తుంది.

Advertisement

అప్పుడు ఆ డాక్టర్ నాకేదో అయిపోతుంది అని భయపడ్డావు కదా దీప చూడు ఇప్పుడు ఏం కాలేదు ధైర్యంగా ఉండు అని అంటుంది. అప్పుడు దీపా శౌర్య గురించి అడగడంతో కార్తీక్ మౌనంగా ఉండగా మిమ్మల్ని నమ్ముకుని తప్పు చేసాను నా కూతుర్ని వెతకడానికి నేనే వెళ్తాను అని ఆపోజిషన్లో బయటకు వెళ్తాను అంటూ ముందు చేయడంతో కార్తీక్ ఆ డాక్టర్ ఇద్దరు దీప ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆ డాక్టర్ కోపం వచ్చి స్టాపిడ్ దీప అని గట్టిగా అరుస్తుంది.

Read Also : Karthika Deepam Dec 6 Today Episode : దీపకు అసలు నిజం చెప్పేసిన కార్తీక్.. దీప ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న చారుశీల..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel