Karthika Deepam Dec 6 Today Episode : దీపకు అసలు నిజం చెప్పేసిన కార్తీక్.. దీప ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న చారుశీల..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్, మోనిత ఇంటి దగ్గరికి వెళ్తాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ మోనిత ఇంటి దగ్గరికి వెళ్లడంతో వెంటనే శివలత అక్కడికి వచ్చి సార్ వచ్చారా మేడం ఇంట్లో లేరు పోలీసులు తీసుకెళ్లారు అనడంతో ఎప్పుడూ అనగా ఈరోజు ప్రొద్దున సార్ అని అంటుంది. అసలేం జరిగింది శివలత అని అడగగా అప్పుడు జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు కార్తీక్ పోలీసు మేడం అంటే రోషిని నా అని అనగా అవును సార్ ఆమెనే అని అంటుంది. ఆ పెద్ద ఆవిడ ఎవరు అనడంతో సౌందర్య నా అని అడగగా ఆవిడ పేరు నాకు తెలియదు అంటుంది.

Advertisement

అప్పుడు వెంటనే కార్తీక్ తన ఫోన్ లో సౌందర్య ఫోటో ఆమె అని అనగా అంటే మమ్మీ ఇక్కడికి వచ్చిందా ఆ రోజు మోనిత మమ్మీ తల పగలగొట్టిందా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మేడం ఎప్పుడు వస్తుంది సార్ అనే శివలత అడగగా మీ మేడం లాంటి వాళ్ళు బయట కంటే లోపల ఉండటమే మంచిది అని లోపలికి బట్టలు తీసుకోవడానికి వెళుతుండగా లేవు సార్ మీ బట్టలు అన్ని మేడం కాల్చేసింది అని చెబుతుంది. మీ మేడమ్ ఎలాగో రాదు కాబట్టి ఆ బోటిక్ ని చూసుకుంటూ బతుకు అని చెప్పి మోనిత కారు ని కూడా శివలతకి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

Advertisement

మరొకవైపు దీప చారుశీలకు తన గతం మొత్తం వివరించడంతో చారుశీల బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని దీప అడగగా మరొక రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము అనడంతో ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేయండి డాక్టర్ అని కార్తీక్ అక్కడికి వస్తాడు. లేదు డాక్టర్ కొన్ని రిపోర్ట్స్ రావాలి అవి రాగానే డిశ్చార్జ్ చేస్తాము అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత దీప సంతోష పడుతూ నా ఆనందానికి కారణం ఆ డాక్టర్ కి తెలియదు అని అనగా ఏంటి ఆ కారణం అనడంతో మీరు ఆ మోనిత దగ్గరికి వెళ్లి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చారు కదా అని అంటుంది దీప.

అప్పుడు మోనితని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పడంతో దీప సంతోష పడుతూ ఇకపై మనకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అని అంటుంది. అవును అత్తయ్య గారు వచ్చారని చెప్పారు కదా మరి సౌర్య కోసం వెతకలేదా ఎందుకు వాళ్ళ దగ్గర లేకుండా ఇక్కడే ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ వీటన్నిటికీ మనకు సమాధానాలు తెలియాలి అంటే మనం మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్లాలి దీప అని అనగా సరే డాక్టర్ బాబు వెళ్దాము అని అంటుంది దీప. మరొకవైపు శౌర్య ఇంద్రుడు దంపతులు కలసి సంతోషంగా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

అప్పుడు సౌర్య మా అమ్మానాన్నలు కనిపించగానే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను అక్కడ అందరం కలిసి హ్యాపీగా ఉండవచ్చు అని అంటుంది. మరొకవైపు చారుశీల కార్తీక్ దీప లకు ఒక ఇంటిని చూపిస్తుంది. అప్పుడు కార్తీక్ దీప సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా దీప రిపోర్ట్స్ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది చారుశీల. ఈ సంతోషం నీకు ఎన్ని రోజులు ఉంటుంది దీప. ఎందుకు ఆ దేవుడు నీ జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు ఆ దేవుడికి అసలు కనికరం లేదు అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఆ తర్వాత కార్తీక్ దీప రిపోర్ట్స్ గురించి అడగడంతో ఇంకా రాలేదు రాగానే చెప్తాను అని అబద్ధం చెబుతుంది చారుశీల.

ఆ తర్వాత దీప, కార్తీక్ ఇద్దరు రోడ్డు మీద సౌర్య కోసం వెతుకుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకు దీప నువ్వు నేను చెప్పిన మాట వినవు. నేను సౌర్య కోసం వెతుకుతాను కదా అని అంటాడు. అప్పుడు కార్తీక్ మన సౌర్యని ఆ ఇంద్రుడు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా దీప అనగా అందుకే కదా డాక్టర్ బాబు వాళ్ళు సౌరిని మనకి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అని అంటుంది. అలానే ఇప్పుడు
సౌర్యని వెతకొద్దు అని చెబుతారా అని అనడంతో అది కాదు దీప మనం అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి వెల్దాము.

Advertisement

హిమను చూడాలనిపిస్తోంది చాలా రోజులు అయింది అనడంతో అవును డాక్టర్ బాబు నేను సౌర్య విషయంలో పడి హిమ గురించి మర్చిపోయాను వెళ్దాము అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను అనగా వద్దు డాక్టర్ బాబు ఇద్దరము కలిసి కారులో అలా షాపింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ అత్తమ్మ వాళ్లకి ఇష్టమైనవి కొనుక్కొని వెళ్దాము అనడంతో సరే అని అంటాడు కార్తీక్.

Advertisement