Devatha: మాధవకు గట్టి షాక్ ఇచ్చిన రాధ… అసలు విషయం తెలుసుకున్న సత్య?

Devatha: కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న దేవత సీరియల్ రోజు రోజుకు ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. దేవి ఆదిత్యనే తన తండ్రి అని తెలుసుకుంటుందా లేదా అనే విషయం గురించి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు ఈ సీరియల్ మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

మాధవ రాదను బ్లాక్ మెయిల్ చేస్తూ తనని కారులో ఎక్కించుకొని ఆదిత్య ఇంటికి వెళ్తున్నామని షాక్ ఇచ్చారు. రాధా కారు ఆపమని ఎంత చెబుతున్న వినకుండా మాధవ మాత్రం ఆదిత్య ఇంటి వరకు వెళ్లి కారు ఆపుతారు. ఇక దేవి మాధవ దిగి రాదను కూడా లోపలికి రమ్మని పిలుస్తారు. రాధ మాత్రం కంగారు పడుతూ తాను రానని ఇక్కడి నుంచి ముందు వెళ్లి పోదామని అడుగుతుంది. ఇక మాధవ దేవిని లోపలికి వెళ్ళమని చెబుతాడు.అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవుడమ్మ ఎవరో కారులో వచ్చినట్టు ఉన్నారు అని చూడగా దేవిని చూసి కారులో వచ్చినట్టు ఉన్నావు కదా అని అడుగుతుంది.

Advertisement

మా అమ్మ నాన్న తీసుకొచ్చారని దేవి దేవుడమ్మతో సమాధానం చెప్పగా మరి లోపలికి రమ్మనలేకపోయావా అని అంటుంది.అమ్మ లోపలికి రావడానికి ఇష్టపడడం లేదని దేవి చెప్పడంతో నేను మీ అమ్మని ఇంతవరకు ఒక్కసారిగా సరిగా చూడలేకపోయాను అంటుంది. మరోవైపు మాధవకారులోకి వెళ్లి రాదను బ్లాక్ మెయిల్ చేస్తారు. నువ్వు నాతో ఉంటానంటే ఆదిత్యకి దేవిని ఇచ్చేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేయగా రాదా కోపంతో మండిపోతుంది.ఈ విధంగా కోపంతో రాదా ఒక్కసారిగా కారు నడుపుతూ మాధవపై ఎక్కించేలా చాలా స్పీడ్ గా తన వద్దకు వచ్చి ఆపుతుంది.

ఇలా రాధా కారు నడపడం చూసిన మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే తనపై కారు ఎక్కడ ఎక్కిస్తుందోనని భయపడతాడు.కారు ఆపిన తర్వాత ట్రాక్టర్ నడిపిన ఈ చేతులకు కారు నడపడం పెద్ద కష్టమేమి కాదు సారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.రాధా ఇలా మాట్లాడే సరికి కోపంతో రగిలిపోయిన మాధవ తనపై మరింత పంతం పెంచుకుంటాడు. ఇక దేవి సత్య ఆదిత్య పెళ్లి ఫోటోలను చూస్తూ మా అమ్మ నాన్న పెళ్లి ఫోటోలు కూడా ఉంటాయి కదా మా అమ్మ నాకు చూపించకుండా దాచేసింది అని మనసులో అనుకుంటుంది.

ఇకపోతే సత్య రూమ్ లో రాధ ఫోన్ బాక్స్ ఉండటంతో అది చూసిన దేవి అరె అచ్చం ఇలాంటి ఫోనే మా అమ్మ దగ్గర కూడా ఉందని దేవి చెబుతుంది. దేవి ఈ విధంగా ఫోన్ గురించి చెప్పడంతో సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆదిత్య ఆ ఫోన్ అక్కకి ఇచ్చారా అని అసలు విషయం తెలుసుకుంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ ఇంతటితో పూర్తి కాగా తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందనే విషయంపై ఆసక్తి రేపుతోంది..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel