Guppedantha Manasu: సాక్షికి గట్టిగా బుద్ధి చెప్పిన జగతి.. వసు తలచుకుని బాధ పడుతున్న రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు,రిషి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసు అమ్మవారి దగ్గరికి వెళ్లి రిషి సార్ ని నువ్వే బాగు చేయాలి అని దండం పెట్టుకుని రిషి కోసం కుంకుమ తీసుకుని మళ్లీ దేవయాని ఇంటికి వెళ్తుంది. వసు రావడం గమనించిన దేవయాని ఎన్నిసార్లు నీకు చెప్పాలి మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నావు అని నానారకాలుగా మాటలు అని అక్కడినుంచి పంపించేస్తుంది.

Advertisement

వసు మాత్రం దేవయాని ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా ఒక్కసారి రిషి సార్ ని చూసి వెళ్తాను మేడం అని బ్రతిమలాడుతుంది. కానీ దేవయాని మాత్రం మరింత కోపంతో ఊగి పోతుంది. వెళతావా లేకపోతే మెడపట్టి బయటకు గెంటేయాల అని అడుగుతుంది. రాజుల ఉండే రిషి నీ కారణంగానే ఇలా అయ్యాడు అని అంటుంది దేవయాని.

అప్పుడు వసు మాటలకు విసుగు చెందిన దేవయాని ధరణి ని పిలిచి వసు నీ గేట్ వరకు గెంటేసి రా అని చెబుతుంది. అప్పుడు వసు అక్కడినుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి సాక్షి రావడం తో సాక్షి ని లోపలికి తీసుకొని వెళుతుంది దేవయాని. మరొకవైపు రిషి, వసుని తలచుకుంటూ కింద పడి పోతూ ఉండగా ఇంతలో సాక్షి అక్కడికి వచ్చి రిషి పట్టుకోవాలని చూస్తుంది.

అప్పుడు రిషి నేను కింద పడినా పర్వాలేదు కానీ నువ్వు నన్ను పట్టుకో వద్దు అని అంటాడు. అప్పుడు జగతి,మహేంద్ర అక్కడికి వచ్చి సాక్షి కి ఎంత చెప్పినా అక్కడినుంచి వెళ్లకపోవడంతో జగతి చేయి పట్టుకొని మరి తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఆ తరువాత రిషి మహేంద్ర తో మాట్లాడుతూ ఏం జరిగిందీ డాడ్ నన్ను ఎవరు ఇంటికి తీసుకొని వచ్చారు అని అంటూ పక్కనే ఉన్న చున్నీ ని చూసి వసుధార కదా అని అడగగా అవును అని అంటాడు మహేంద్ర.

Advertisement

అప్పుడు మహేంద్ర సహాయంతో రిషి అలా నడుచుకుంటూ బయటకి వెళ్ళాడు. ఇంటి బయట వసు ని చూసిన రిషి అంతా తన భ్రమ అనుకొని లోపలికి వెళ్ళి పోతాడు. రేపటి ఎపిసోడ్ లో ఇంటి బయట ఉన్న వసు దగ్గరికి గౌతం వెళ్లి నువ్వు నిజంగానే రిషి ని వద్దనుకుంటే ఎందుకు ఇంతలా బాధ పడుతున్నావు అని నిలదీస్తాడు. ఇంతలోనే మహేంద్ర వీడియో కాల్ చేసి రిషిని చూపిస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel