Guppedantha Manasu: ఒంటరి అయిన వసు..రిషి ఏం చేయనున్నాడు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు ఇంట్లో వెళ్ళి పోతూ ఉండడంతో రిషి లోలోపల బాధపడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, నేను చెప్పిన కూడా నువ్వు ఇక్కడ ఉండవా వసు అని అడగడంతో ఏ అర్హతతో ఉండాలి సార్ అని అడుగుతుంది. ఇది కాకుండా ఇక్కడే ఉండమని గొప్ప మనసు మీకు ఉన్న ఉండిపోయే అంత అర్హత నాకు లేదు అని అంటుంది.

Advertisement

మరొక వైపు దేవయాని మనసులో మీ అందరికి ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని ఆనంద పడుతూ ఉంటుంది. ఇక వసు ఇంటి నుంచి వెళ్ళి పోతూ ఉండడంతో రిషి ఆ బాధను బయటికి వ్యక్తపరచలేక లోలోపల కుమిలిపోతుంటారు.

నీకు నాకు మధ్య ఏదో బంధం ఉంది వసు అందుకే నువ్వు వెళ్లిపోతుంటే నాకు ఏదోలా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి. వసు అలా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వెంటనే అనుకోకుండా సాక్షి ఎంట్రీ ఇస్తుంది. సాక్షి ఎంట్రీ ఇవ్వడంతో దేవయాని ఆనందంతో హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వస్తుంది.

ఆ తర్వాత లోపలకు వచ్చిన సాక్షి రిషికి దగ్గరవ్వడానికి నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ ఆంటీ అని దేవయానికి థాంక్స్ చెబుతుంది. మరొకవైపు ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వసు, రిషి కీ థాంక్స్ అని మెసేజ్ చేస్తుంది. ఒక వసు థాంక్స్ అని మెసేజ్ చేయడంతో రిషి ఎందుకా అని ఆలోచనలో పడతాడు.

Advertisement

అలాగే వసు నుంచి వెళ్లిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. మరొక వైపు దేవయాని, సాక్షితో మాట్లాడుతూ ఇకపై నువ్వు రిషి కి ఇక పై మిస్సెస్ కావాలి అని దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర, జగతి అక్కడికి రావడంతో వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకుంటుంది సాక్షి. మరొక వైపు సాక్షి ఈ సమయంలో ఎందుకు వచ్చింది అని ధరణి భయ పడుతూ ఉంటుంది.

ఇక రిషి రూమ్ లోకి వెళ్లిన సాక్షి రిషి తో మాట్లాడడానికి ప్రయత్నించగా రిషి మాత్రం అవాయిడ్ చేస్తాడు. ఎందుకు వచ్చావు అని నిలదీస్తాడు. మరొక వైపు దేవయాని, వసు తలచుకొని ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel