Guppedantha Manasu serial September 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని కావాలనే జగతిని నిందిస్తూ రిషి ముందు బ్యాడ్ చేయాలి అని చూస్తుండగా ఇంతలో మహేంద్ర కోపంతోవదిన మీరు ఈ విషయంలో తల దూర్చవద్దు ఇది మా సమస్య అని అంటాడు. అప్పుడు దేవయాని కావాలని దొంగ ఏడుపులు ఏడుస్తున్నట్లు నటిస్తూ అంటే ఇది మీ కుటుంబ సమస్య నేను పరాయిదాన్ని అంటున్నావా మహేంద్ర అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది.

అప్పుడు రిషి , ఏంటి పెద్దమ్మ మీరు బాధపడకండి అంటూ ఓదారుస్తూ ఉండగా దేవయాని మరింత రెచ్చిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కోపంతో రగిలిపోతున్న రిషి కారు వేసుకుని వెళ్తాడు. మరొకవైపు వసు గుడిలో దేవుడితో తన బాధలు చెప్పుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి కోపంగా మాట్లాడతాడు.
అప్పుడు జరిగిన విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు వసుధార అని చెప్పినా కూడా వసు మాత్రం వినిపించుకోకుండా ఎలా అయినా మీరు జగతి మేడంని అమ్మ అని పిలవాలి సార్ అని మాట్లాడడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జరగదు అనుకున్న విషయం ఎప్పటికైనా జరుగుతుంది ఆ నమ్మకం నాకు ఉంది సార్ అని అంటుంది.
Guppedantha Manasu serial : వసుధార టెన్షన్..రిషి ముందు దేవయాని నటన..
అప్పుడు మీ అమ్మగారు మీ మంచి కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో తెలుసా సార్ అని అనగా వెంటనే చూసి నేను కూడా జగతి మేడం కోసం ఎన్నో మెట్లు దిగి వచ్చాను అని అంటాడు. నాకు జగతి మేడం అంటే గౌరవం ఉంది కానీ అమ్మ అని మాత్రం పిలవను అని అంటాడు రిషి. వసుధార మాత్రం నిన్ను ఎలా అయినా మీతో జగతి మేడంని అమ్మ అని పిలిపించి తీరుతాను అని అనడంతో ఎందుకు వసుధర చెప్పినా కూడా వినిపించుకోవు అని కోపంతో రగిలిపోయిన రిషి అక్కడే ఉన్న గంటను గట్టిగా కొడతాడు.
రిషి చేతికి గాయం అవడంతో వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వసు గాయం అయింది అని బాధపడుతున్న కూడా రిషి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వరకు వైపు జగతి మహేంద్ర గౌతమ్ లో ఇంట్లో కూర్చుని ఉండగా వారు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు వసుధర రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ వసుధార, రిషి లకు ఫోన్ చేస్తాడు.
అప్పుడు రిషి నువ్వు గౌతమ్ ఫోన్ చేసినా కూడా ఇక్కడ జరిగిన విషయాలు ఏవి చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు వసుధార పదేపదే హాస్పిటల్ కి వెళ్ళాము అని అనగా రిషి కోపంతో వసుధారని బస్ స్టాప్ లో దింపేసి ఇంటికి వెళ్ళిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కాలేజీకి ఉన్నట్లుగా ఊహించుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఆ తర్వాత రిషి ఒక సోఫాలో పడుకొని ఉండగా వసు అక్కడికి వచ్చి కట్టు కడుతూ ఉంటుంది. అప్పుడు మెలకువ వచ్చిన రిషి, ఏం చేస్తున్నావ్ వసు చేయి వదులు అని అంటాడు వసు మాత్రం చేయి వదలకుండా కట్టు కడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో వసుధర అని అనగా మీరు వెళ్తే నేను వెళ్తాను సార్ అని అంటుంది. వారిద్దరు కొద్దిసేపు ప్రేమగా వాదించుకుంటూ ఉంటారు.
- Guppedantha Manasu: వసు మాటలకు కోపంతో రగిలిపోతున్న దేవయాని..వసుని ఆటపట్టించిన రిషి..?
- Guppedantha Manasu serial Oct 4 Today Episode : మహేంద్రకు మనసులో మాట చెప్పిన రిషి.. వసు చిలిపి పనులు చూసి మురిసిపోతున్న రిషి..?
- Guppedantha Manasu january 26 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార.?















