వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Guppedantha Manasu: వసు మాటలకు కోపంతో రగిలిపోతున్న దేవయాని..వసుని ఆటపట్టించిన రిషి..?

Category FailedGuppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహేంద్ర, రిషి, గౌతమ్ లు కలసి హాస్పిటల్ కి వెళ్తారు. ఇక హాస్పిటల్ లో డాక్టర్ డాడ్ తన ఆరోగ్యంపై శ్రద్ధ శ్రద్ధ వహించడం లేదు అని చెప్పడంతో అప్పుడు డాక్టర్ మహేంద్ర కు టెస్టులు చేయడానికి లోపలికి తీసుకొని వెళ్తారు. మరొకవైపు హాస్పటల్లో బయట ... Read more

By Ramesh Babu

Published on: April 7, 2022 9:46 AM

Updated on: April 7, 2022 9:46 AM

---Advertisement---

Category Failed

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహేంద్ర, రిషి, గౌతమ్ లు కలసి హాస్పిటల్ కి వెళ్తారు.

ఇక హాస్పిటల్ లో డాక్టర్ డాడ్ తన ఆరోగ్యంపై శ్రద్ధ శ్రద్ధ వహించడం లేదు అని చెప్పడంతో అప్పుడు డాక్టర్ మహేంద్ర కు టెస్టులు చేయడానికి లోపలికి తీసుకొని వెళ్తారు. మరొకవైపు హాస్పటల్లో బయట కూర్చున్న గౌతమ్, వసు గురించి ఆలోచిస్తూ తనకి వసు కి మధ్య ప్రతిసారి రిషి అడ్డువస్తున్నాడు అంటూ మనసులో రిషి ని తిట్టుకుంటూ ఉంటాడు గౌతమ్.

ఇంతలో డాక్టర్ మహేంద్ర కు అన్ని టెస్టులు చేసి బాగానే ఉంది అని చెప్పడంతో అక్కడి నుంచి ఆనందంగా బయలుదేరుతారు మహేంద్ర, రిషి. ఆ తరువాత మహేంద్ర, రిషి, గౌతమ్ లు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు రిషి బాధపడుతూ డాడ్ మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి అని చెబుతాడు. అంతే కాకుండా వీలైనంత త్వరగా నా దగ్గరకు వచ్చేయండి అని చెబుతాడు రిషి.

మరొకవైపు జగతి, మహేంద్ర వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర కు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడగడంతో రెండు నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. ఇక మహేంద్ర వారి కోసం జగతి ఎదురు చూస్తూ ఉండగానే ఇంతలో వాళ్ళు రానే వస్తారు.

అప్పుడు గౌతమ్ నేను కూడా ఇంట్లోకి వెళ్లి అంకుల్ ని వదిలిపెట్టి వస్తాను అని చెప్పి ఇంట్లో కి వెళ్తాడు. రిషి మాత్రం ఇంట్లోకి వెళ్లకుండా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. గౌతమ్ ఇంట్లో నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రిషి పదే పదే కారు హార్న్ కొడుతూ ఉంటాడు. ఇంతలోనే వసు, రిషి కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది.

అయితే అప్పటికే ఆ ఐస్ క్రీమ్ కరిగిపోవడం తో ఐస్ క్రీమ్ ని చూసి రిషి పాయసం అంటూ వసుని ఆట పట్టిస్తాడు. మరొకవైపు దేవయాని ధరణి ని తన మాటలతో బాధ పెడుతూ ఉంటుంది. ఇంతలో రిషి, గౌతమ్ రావడంతో ఎక్కడికి వెళ్లారు అని అడగగా అప్పుడు గౌతం మహేంద్ర అనుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళాను అని చెబుతాడు.

అప్పుడు దేవయాని మహేంద్ర చూసుకోవడానికి జగతి ఉంది కదా అంటూ మహేంద్ర ను వేరు చేసి మాట్లాడటంతో ఇంతలో ఫణీంద్ర వచ్చి జగతిని తిడతాడు. ఇక మరొకవైపు వసు, జగతి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ రిషి ఇంటికి వెళుతుంది. ఇక గుమ్మంలోనే వసు కి దేవయాని ఎదురు పడడంతో వసు తనదైన శైలిలో దేవయాని కి బుద్ధి చెప్పి రిషి రూమ్ కి వెళుతుంది.

వసు మాటలకు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసు ని చూసిన రిషి అయ్యే వసు మేడమ్ కూర్చొండి, టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు అని ఆట పట్టిస్తాడు. అప్పుడు వసు హర్ట్ అయి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel