వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Alia ranbir: ఆలియాకు సూపర్ కాస్ట్లీ గిఫ్ట్.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే వివాహానికి ముందే హీరో రణ్​బీర్​ కపూర్​ తనకు కాబోయే భార్య హీరోయిన్​ ఆలియా భట్​కు ఖరీదైన కానుక ఇచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్​ను బహూకరించారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని రణ్​బీర్​ నివాసం ‘వాస్తు’లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ... Read more

By Vinod Kumar

Published on: April 14, 2022 3:43 PM

Updated on: April 14, 2022 3:43 PM

---Advertisement---

ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే వివాహానికి ముందే హీరో రణ్​బీర్​ కపూర్​ తనకు కాబోయే భార్య హీరోయిన్​ ఆలియా భట్​కు ఖరీదైన కానుక ఇచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్​ను బహూకరించారని టాక్ నడుస్తోంది.

బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని రణ్​బీర్​ నివాసం ‘వాస్తు’లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమ పక్షులకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. రణ్​బీర్​ తనకు కాబోయే భార్యకు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చారని బీ టౌన్ కోడై కూస్తోంది. ఈ ముద్దు గుమ్మ కోసం ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన కాస్ట్లీ బ్యాండ్​ ను తయారు చేయించి ఇచ్చారట. లండన్​ నుంచి దీన్ని తెప్పించారని టాక్ నడుస్తోంది. ఈ వజ్రాల బ్యాండ్​ ను ఆలియా భట్ వివాహ వేడుకలో ధరించనుంది అని సన్నిహితులు చెబుతున్నారు.

ఇప్పుడు రణ్ బీర్ ఇచ్చిన గిఫ్ట్ కు ప్రత్యేకత ఏమిటి అంటే 8 సంఖ్య. ఆ సంఖ్య కపూర్​ కుటుంబానికి లక్కీ నంబర్​ అంట. మరో వైపు ఆలియాకు కూడా 8 సంఖ్య లక్కీ నంబరు అని తెలిసింది. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వజ్రాలు పొదిగిన బ్యాండ్​ను రణ్​బీర్​ బహూకరించారని అంతా అనుకుంటున్నారు. ఘనంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ, వరుణ్​ ధావన్​, అయాన్​ ముఖర్జీ, జోయా అక్తర్​, అర్జున్​ కపూర్​, మసాబా గుప్తా, కరణ్​ జోహార్​, కరీష్మా కపూర్​, కరీనా కపూర్​, సైఫ్​ అలీఖాన్​ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel