Two girls married: పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. నెక్స్ట్ ఏం జరిగిందటే?

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఓ యువతి తల్లి.. మరో అమ్మాయి తన కూతురిని అక్రమంగా నిర్బంధించిందంటూ కోర్టును ఆశ్రయించింది. యువతి తల్లి అంజు దేవీ హైకోర్టులో కోర్టులో హెబియస్ కార్పస్​ పిటిషన్ వేసింది. దీంతో కోర్టు ఆ ఇద్దరినీ న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్​ 6న ఆదేశించింది. మరుసటి రోజే కోర్టు ముందుకు వచ్చిన ఇరువురు యువతులు ‘మేము వివాహం చేసుకున్నాం. దానిని అంగీకరించాలి’ అని కోర్టును అభ్యర్థించారు.


అయితే యువతి తల్లి తరఫున వాదించేందుకు వచ్చిన లాయర్… స్వలింగ సంపర్కుల వివాహానికి అడ్డు చెప్పనని, కేసు వాదించట్లేదంటూ చేతులెత్తేశారు. అలాగే ‘పవిత్ర భారత దేశంలో వివాహాన్ని సంస్కారంగా భావిస్తారు. పురుషుడు, స్త్రీ మధ్యే పెళ్లి జరగాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. దీంతో.. హైకోర్టు ఆ మహిళల పిటిషన్ ​ను విచారించలేమంటూ తిరస్కరించింది. యువతి తల్లి వేసిన హెబియస్​ కార్పస్​ వ్యాజ్యాన్ని సైతం కొట్టేసింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel