Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి పదేళ్లు నిండాయి. జూన్ 14, 2012న రామ్ చరణ్, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కరెక్టుగా వీరి వివాహ బంధానికి పదేళ్లు వయసు వచ్చింది. ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని చరణ్ ఉపాసన దంపతులు విదేశాల్లో జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇటలీ వెళ్లారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలె ఆయన నటించిన ఆర్ఆర్‌ఆర్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండానే శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు చరణ్. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే రామ్ చరణ్… షూటింగుల నుండి ఏ మాత్రం చిన్న గ్యాప్ దొరికినా విదేశాలకు వెళ్లి సరదాగా గడుపుతుంటారు. ఇక రామ్ చరణ్ దంపతులకు ప్రత్యేకమైన సందర్భం కావడంతో పదో వివాహ వార్షికోత్సవానికి ఇటలీ వెళ్లారు. ఇటీవలె చరణ్ ఉపాసన స్టన్నింగ్ లుక్ లో కనిపించారు. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని చిరు- శ్రీదేవిలా కనిపించారు.
వీరి మ్యారేజ్ యానివర్సరీ వేడుకను మెగా అబిమానులు ముందే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చరణ్, ఉపాసన వెడ్డింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.















