Guppedantha Manasu january 10 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మహేంద్ర, జగతి ఇద్దరు ఇంటికి వెళతారు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని ఇంటికి రావడంతో జగతి అక్కయ్య మీకు రిషి ఫోన్ చేశాడా అని అడగగా లేదు అదేంటి మీతో పాటు రాలేదా జగతి అంటూ ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటుంది. లేదు వదిన గారు రిషి మా కంటే ముందు కార్లు బయలుదేరాడు ఇక్కడికి వచ్చాడు అనుకున్నాము అనడంతో అనుకోవడం ఏంటి మహేంద్ర అయినా మీకు బుద్ధి లేదా అంటూ జగతి దంపతులపై సీరియస్ అవుతుంది దేవయాని. రెండు కార్లు ఉన్నాయి కదా రిషిని కూడా మీతో పాటు పిలుచుకొని రావచ్చు కదా అనడంతో మేము ఆ పరిస్థితిలో ఏం చెప్పినా రిషి వినిపించుకోలేడు వదిన అని అంటాడు మహేంద్ర.

అప్పుడు దేవయాని మహేంద్ర వాళ్ళ పై సీరియస్ అవుతూ రిషి లేని దొంగ ప్రేమలు అని కురిపిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఫణీంద్ర అక్కడికి వచ్చి ఏంటి మహేంద్ర ఎప్పుడు వచ్చారు అని అడగగా ఇప్పుడే వచ్చాము అన్నయ్య అని అంటాడు మహేంద్ర. రిషి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉండగా అసలు ఏమయ్యింది అని ఫణింద్ర అడగడంతో మహేంద్ర జరిగింది మొత్తం వివరిస్తాడు. దాంతో ఫణీంద్ర, ధరణి షాక్ అవుతారు. అప్పుడు మీరేం భయపడకండి రిషి వస్తాడు అని ఫణింద్ర అనడంతో అప్పుడు దేవయాని దొంగ ప్రేమలు చూపిస్తూ అసలు రిషి ఎక్కడ ఉన్నాడు ఏమో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు రిషి వసుధార కోసం మళ్లీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వసుధర అన్న మాటలు తెలుసుకొని ఎందుకు వసుధార ఇలా చేస్తున్నావు అసలు ఏమైంది అని బాధపడుతూ ఉంటాడు. నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగి వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను నాకు ఆ సమాధానం తెలియాలి అని అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రాజీవ్ రిషి బయట ఉండడం గమనించి వసుధార దగ్గరికి వెళ్లి మీ రిషి సార్ మళ్లీ వచ్చాడు అనడంతో నాకు తెలుసు అని అంటుంది. మీ రిషి సార్ నేను చెప్తే వినడు అని అంటాడు. నేను రిషి సార్ కు నిజం చెప్పేస్తాను అనడంతో మీ అమ్మ నాన్నతో పాటు రిషి ని కూడా చంపేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని వసుధార ని బెదిరిస్తాడు రాజీవ్.
ఇంతలోనే అక్కడికి ఎస్ఐ రావడంతో ఎస్ఐ ని బ్రతిమలాడుతూ ఉంటాడు రిషి. ఇప్పుడు ఎస్ఐ నీకు మాటలతో చెప్తే నీకు అర్థం కాదా ఇకనుంచి వెళ్ళు అనే సీరియస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్లి వసుధార మీద సీరియస్ అవుతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతను వెళ్లాడా లేదా చూడు కానిస్టేబుల్ అనగా లేదు సార్ అని అంటాడు. అప్పుడు ఆ ఎస్ఐ నాకు వీళ్ళు పెద్ద తలనొప్పిలా మారారు అతన్ని లోపలికి పిలుచు ఏదో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను అన్నాడు అనడంతో రిషి లోపలికి వస్తాడు. రిషి లోపలికి రావడంతో వసుధార ఒక ముఖం చూపించకుండా పక్కకు నిలబడుతుంది.
అప్పుడు రిషి ఒక్క ప్రశ్న వసుధార నీ మెడలో ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు అనడంతో, నా ఇష్టం తోనే నా మెడలో తాళి పడింది. నా ఇష్టపూర్వకంగానే నా పెళ్లి జరిగింది నేను ఇంతకంటే మీకు ఎక్కువ ఏమీ చెప్పలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అనడంతో రిషి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా అనడంతో అవును సార్ నా ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగింది అనగా రిషి షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు రాజీవ్ నవ్వుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత వసుధార జైల్లో గోడపై రిషిధార అని పేరు రాసి దాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత కారులో వెళ్తున్న రిషి పదేపదే వసుధార అన్నమాట తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసుధార ఆ పేరును చూసి బాధపడుతూ ఉంటుంది.
- Guppedantha Manasu july 8 Today Episode : సాక్షిపై విరుచుకుపడిన రిషి.. వసు గురించి టెన్షన్ పడుతున్న రిషి..?
- Guppedantha Manasu May 25 Today Episode : వసుధారనే తన లైఫ్ పాట్నర్ అనుకుంటున్న రిషి.. సాక్షి ఏం చేయనుంది..?
- Guppedantha Manasu Aug 24 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగతి..?















