Guppedantha Manasu Aug 3 Today Episode : తెలుగు బుల్లితెర పై గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి గురించి రిషి, దేవయానికి చెబుతూ ఆరోజు లైబ్రరీలో నేను తనని అల్లరి చేశాను అని అందరికీ చెబుతానని బెదిరించింది. అలాగే మొన్న కూడా చదువులో పండుగలో వసుతో నేను ఉన్న ఫోటోలు నాకే చూపించి ఇవి అందరికీ పెడతాను అంటూ నన్ను బెదిరించింది అని చెప్పడంతో ఆ మాటలు విని దేవయాని షాక్ అవుతుంది. ఇంత చేసినా కూడా సాక్షి పై ఇంకా పాపం అంటారా అంటూ దేవయానిపై విరుచుకుపడతాడు రిషి.

ఇప్పటివరకు సాక్షి ఏం చేసినా భరించాను ఇకపై అలాగే తప్పులు చేస్తే నా అసలు రూపం బయటికి తీయాల్సి వస్తుంది అని దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు మహేంద్ర, పొగుడుతూ ఉండగా వెంటనే దేవయాని తన మనసులో ఇక సాక్షి పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత జగతి, దేవయాని దగ్గరికి వచ్చి వెటకారంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Guppedantha Manasu Aug 3 Today Episode : సాక్షి విషయంలో దేవయానిని హెచ్చరించిన రిషి..
మరొకవైపు రిషి రాకపోవడంతో వసు బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రిసీవ్ అక్కడికి వచ్చి వసూలు చేయి పట్టుకుని ఏం మాట్లాడుకుండా నాతో రా అని చెప్పి కార్ లో తీసుకెళ్తాడు. అప్పుడు రిషికి సాక్షి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడగగా నేను వసుతో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిషి. మరొకవైపు జగతి దంపతులకు ధరణి కాఫీ ఇస్తూ దేవయాని గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు వసు ఆ గిఫ్ట్ గురించి ఆలోచించుకుంటూ ఉండగా వెంటనే రిషి ఏదైనా సంఘటన జరిగితే దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటావా అని అడుగుతాడు. మరోవైపు సాక్షి,దేవయాని ఇంటికి వచ్చి అసలు నేను ఈ ఇంటి కోడలినేనా? రిషి నాతో ఉండాల్సింది పోయి ఆ వసుధారతో షికారుకు వెళ్లాడట.. ఫోన్ చేస్తే ఒక్క మాటలో సమాధానం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు జీవితాంతం ఉండాల్సింది నాతో అయినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అందరి ముందు గట్టిగా అరుస్తుంది.

వెంటనే జగతి నీ రిషి కి మధ్య ఏమైనా గొడవ ఉంటే మాట్లాడుకో సమస్య తేల్చుకో అంతే కానీ ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయొద్దు అని అంటుంది. అప్పుడు దేవయాని అసలు ఏంటి సమస్య అని అడగగా జరిగింది మొత్తం వివరిస్తుంది సాక్షి. వెంటనే దేవయాని, రిషి నిన్ను ఇష్టపడటం లేదు నిన్ను పెళ్లి చేసుకోడంట అన్ని అనడంతో సాక్షి షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Guppedantha Manasu: సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని.. గౌతమ్ పై మండిపడ్డ రిషి..?
- Guppedantha Manasu Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : వసుధారని చూసి షాక్ అయిన జగతి దంపతులు.. అదేంటో తెలుసుకోవాలనే ఆరాటంలో దేవయాని..?
- Guppedantha Manasu May 30 Today Episode : బాధతో కుమిలిపోతున్న వసుధార..బార్ లో మందు కొడుతున్న రిషి..?













