Puri jagannadh Daughter : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. పూరి జగన్నాథ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించిన మొట్టమొదటి సినిమా ఇది. ఛార్మీ, పూరి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మీద బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల ఈ సినిమా కోసం పూరీ 3 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. ఈ రోజు ( ఆగష్టు 25 ) విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

లైగర్ సినిమా రిలీజ్ సందర్భంగా పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో పవిత్ర షేర్ చేసిన పోస్ట్ లో ” మై ఫరెవర్. నా లైఫ్ లో నేను ఇంత నెర్వస్ గా ఎప్పుడూ ఫీల్ అవలేదు. ఈ రోజు మీ జీవితంలో ముఖ్యమైన రోజు. ఈ సినిమా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, నీ కష్టానికి రేపు ఫలితం దక్కుతుంది. ఇది నీ లైఫ్ లో ఇది చాలా పెద్ద సినిమా. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో నాన్న.. నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందుకోవడానికి జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదనే విషయంలో నిన్నే స్ఫూర్తిగా తీసుకున్నాను. నువ్వు , నీ టీం ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.
Puri jagannadh Daughter : పూరీ జగన్నాథ్ కూతురు మోషనల్ పోస్ట్ షేర్..
ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. నువ్వు నా రాక్.. అలాగే వీక్ నెస్ కూడా నాన్న. మీ బిగ్ డే రోజు నేను నీదగ్గర నీ లేకపోయినా కూడా నా ఆనందం, విజిల్స్ నిన్ను చేరుకుంటాయి. నీ మూవీ మొత్తం నేను చీర్ చేస్తాను. నిన్ను హోల్డ్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నాను పింకీ. వుయ్ లవ్ యు సో మచ్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.















