Intinti Gruhalakshmi: శృతిని వెతుక్కుంటూ వెళ్లిన ప్రేమ్.. తులసికి సహాయం చేయాలి అనుకున్న సామ్రాట్?

Updated on: July 22, 2022

Intinti Gruhalakshmi july 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి కోసం సామ్రాట్ ఒక బ్లాంక్ చెక్ ని తులసి ఇంటికి పంపిస్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తో తన కూతురు కలిసి సరదాగా ఆడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. తులసిని చూసిన సామ్రాట్ ఎందుకు వచ్చిందని అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు తులసి హనీ దగ్గరికి వెళ్లి ముద్దుగా పలకరించి ముద్దు పెడుతుంది. అంతేకాకుండా హనీకి ఇష్టమైన ఆహారాన్ని తేవడంతో హనీకి ఇష్టంగా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది.

 Intinti Gruhalakshmi july 22 Today Episode :Prem tries to find out Shruthi's whereabouts in todays intinti gruhalakshmi serial episode
Intinti Gruhalakshmi july 22 Today Episode :Prem tries to find out Shruthi’s whereabouts in todays intinti gruhalakshmi serial episode

ఇక పక్కనే ఉన్న సామ్రాట్ తన బాబాయ్ తో బ్లాంక్ చెక్ ఇచ్చాను కదా దాన్ని రిజల్ట్ దాని రిజెల్ట్ ఇది అని అంటాడు. ఆ తర్వాత హనీ లోపలికి వెళ్లడంతో వెంటనే తులసి తనకు చెక్ ఇచ్చినందుకు తులసి కృతజ్ఞతలు తెలుపగా వెంటనే సామ్రాట్ మళ్లీ తులసిని తప్పుగా అపార్థం చేసుకుంటాడు. నేను ఎవరికైనా డబ్బుతోనే చేస్తాను నీకు నచ్చినంత రాసుకో అని తులసికి చెబుతాడు.

Advertisement

Intinti Gruhalakshmi  : సామ్రాట్ బ్లాంక్ చెక్ కి మైండ్ బ్లాంక్ అయ్యేలా తులసి జవాబు…

కానీ తులసి మాత్రం సామ్రాట్ కి తిరిగి చెక్కి ఇచ్చేస్తుంది. అంతేకాకుండా సామ్రాట్ కి తన మాటలతో తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అంతేకాకుండా ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి ఏదైనా తినేది తీసుకురావాలి అని అందుకే హనీకి ఇష్టమైన ఫుడ్ తీసుకుని వచ్చాను అంతకుమించి మరియు ఉద్దేశం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరొకవైపు ప్రేమ్ శృతి కోసం వెతుకుతూ ఉంటాడు. తన తల్లి దగ్గరికి వెళ్లలేదు అని అనుకున్న ప్రేమ్ మరి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత తన అత్త ఇంటికి వెళ్ళింది అనుకున్న ప్రేమ్ అక్కడికి వెళ్తాడు. మరోవైపు శృతి, ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే వాళ్ళ అత్త అక్కడికి వచ్చి నీ ప్రేమ్ వస్తాడు అన్నావు మరి ఎక్కడ అని అడుగుతుంది.

ఇంతలోనే ప్రేమ రావడానికి గమనించిన వాళ్ళు శృతి ప్రేమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా తన అత్తయ్య ఆపి కాసేపు అతను ఏంటో తెలుసుకుంటాను అని చెప్పింది లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి వాళ్ళ అత్తయ్యకు శృతి లేదు అన్న విషయం చెబితే ఆమె కంగారు పడి ఆ విషయం ఎక్కడ తులసికి చెబుతుందో అన్న భయంతో చెప్పకుండా ఉండడంతో శృతి వాళ్ళ అత్త దానిని అపార్థం చేసుకుంటుంది.

Advertisement

అప్పుడు ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో శృతి బాధపడుతుంది. ప్రేమ్ ని అపార్థం చేసుకున్న శృతి వల్ల అత్త శృతికి కూడా అదే విధంగా చెబుతుంది. మరొకవైపు నందు సామ్రాట్ ఆఫీస్ లో జాయిన్ అవుతాడు. అప్పుడు సామ్రాట్ నందు కి పనులను అప్పజెబుతాడు. ఆ తర్వాత ఎలా అయినా తులసికి తెలియకుండా సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు.

Read Also : Intinti Gruhalakshmi: అత్త ఇంటికి చేరుకున్న శృతి.. సంతోషంలో అంకిత..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel