Nuvvu Nenu Prema Serial : పద్మావతిని చూడగానే పరారైన మురళి.. ఎమోషనల్ అయిన అరవింద.. ఓదార్చిన పద్మావతి

Updated on: August 18, 2022

Nuvvu Nenu Prema Serial Aug 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మురళి పార్టీ నుండి తప్పించుకొని బయటికి వస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం.  విక్కీ పద్మావతి వైపు అదేపనిగా చూస్తుంటాడు. అప్పుడు పద్మావతి అను తో ఏంటక్కా ఈ టెంపరోడు నన్ను చూస్తున్నాడు ఇకముందు ఎప్పుడు ఇలా నన్ను చూడలేదు కదా అంటుంది.

ఇక అరవింద పద్మావతిని కేక్ తీసుకుని రమ్మని చెప్తుంది. ఇక పద్మావతి అక్కడికి తీసుకొని వస్తుంది. అప్పుడు అరవింద వాళ్ళ నానమ్మ మురళి ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు విక్కీ ఫోన్ వస్తే బయటికి వెళ్లాడు ఏమో ఉండు అక్క నేను చూస్తాను అంటూ బయటికి వెళ్తాడు. ఇక అందరూ మురళి కోసం వెతుకుతారు. మురళి బయట ఉండి పద్మావతి కి నిజం తెలుస్తుందేమో అని కంగారు పడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు అరవింద కి ఏం చెప్పినా నమ్ముతూ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.

Nuvvu Nenu Prema Aug 18 Today Episode
Nuvvu Nenu Prema Aug 18 Today Episode

ఇది నా యానివర్సరీ ఫంక్షన్ కాబట్టే ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు ఏం చేయాలో అర్థం కావడంలేదు అనుకుంటాడు. ఇక అరవింద మురళి కి కాల్ చేస్తుంది.  అప్పుడు మురళి కాల్ లిఫ్ట్ చేస్తాను అరవింద ఏమండీ మీరు ఎక్కడ ఉన్నారు త్వరగా ఇక్కడికి రండి అంటుంది. అప్పుడు మురళి నేను ఇంట్లో లేను ఒక పని మీద బయటికి వచ్చాను అంటాడు. ఈ టైంలో ఏం పని అనగానే ఒక ముద్దాయిని మెజిస్ట్రేట్ కు అప్పగించే పని ఉంది. ఒకవేళ నేను అక్కడ లేకపోతే ఒక భార్య తన భర్త కి దూరం అవుతుంది. ఒక బిడ్డ తన తండ్రి కి దూరమవుతుంది. అందుకే నేను అక్కడ ఉండలేక వచ్చేసాను. నావల్ల ఒక ఫ్యామిలీ అన్యాయం అవ్వడం నాకిష్టం లేదు అంటాడు. నువ్వు ఏడవకు రాణమ్మ ఒకవేళ నేను రావాలి అంటే చెప్పు ఇప్పుడే వస్తాను అంటాడు. అప్పుడు అరవింద ఏం వద్దు మీరు పని పూర్తయ్యాక రండి అంటుంది. ఇక మురళి ఇప్పటిక అంటాడు.

Advertisement

అప్పుడు అరవింద ఏం వద్దు మీరు పని పూర్తయ్యాక రండి అంటుంది. ఇక మురళి ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను ఇకమీదట ఇలా జరగకుండా చూసుకోవాలి. నేను తిరుపతి కైనా వెళ్లాలి లేకపోతే పద్మావతి నీ ఇంటికి రాకుండా చూడాలి అనుకుంటాడు. డబ్బు కోసం అరవింద, ఎంజాయ్మెంట్ కోసం పద్మావతి నాకు ఇద్దరు కావాలి అనుకుంటాడు. ఇక విక్కీ మరియు ఆర్య కి వాళ్ల బావ గారు ఎక్కడ చూసినా కనిపించడు. ఇక విక్కీ అరవింద దగ్గరికి వచ్చి అక్క బావ గారికి కాల్ చేస్తున్నా కాల్ కలవట్లేదు అంటాడు.  అప్పుడు అరవింద నాకు బావగారు కాల్ చేశాడు ఆయన ఇక్కడ లేడు పని మీద బయటకు వెళ్ళాడు అని కృష్ణ తనకు చెప్పిన విషయం గురించి అందరికీ చెప్తుంది. అప్పుడు ఆర్య అక్క తన యానివర్సరీ ని కూడా పక్కన పెట్టి బావ గారు ఒక ఫ్యామిలీని కాపాడడానికి వెళ్ళాడు. అలాంటి వాడు మన ఫ్యామిలీ లో ఉండటం చాలా గర్వంగా ఉంది అంటాడు.

Nuvvu Nenu Prema Serial Aug 18 Today Episode : అరవిందకు ధైర్యం చెప్పిన పద్మావతి.. నీలాంటి ఆడపిల్ల కోడలిగా దొరకాలన్న బామ్మ

Nuvvu Nenu Prema Aug 18 Today Episode
Nuvvu Nenu Prema Aug 18 Today Episode

అప్పుడు విక్కీ అక్క నువ్వు బాధపడకు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నిన్ను బాధ పెడితే అది ఎవరైనా సరే నేను ఊరుకోను అంటాడు.  అప్పుడు పద్మావతి వాళ్ళ అక్క తో విక్రమాదిత్య ఇవాళ కొత్తగా కనిపిస్తున్నాడు అంటుంది. అప్పుడు అను కూడా విక్రమాదిత్య కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం అనుకుంటా వాళ్ళ అక్క కి ఏమైనా జరిగితే తట్టుకోలేడు అంటుంది. అప్పుడు పద్మావతి కూడా బయట ఎంతమందితో ఎలా ఉన్నా వాళ్ళ అక్క దగ్గర మాత్రం చాలా ప్రేమగా ఉన్నాడు మనం చూసిన విక్రమాదిత్య కి ఇక్కడ ఉన్న విక్రమాదిత్య కి చాలా తేడా ఉంది అంటుంది.

ఇక విక్కీ వాళ్ళ అక్క తో అక్క కేక్ కట్ చేద్దామా లేకపోతే బావగారు వచ్చే వరకు వెయిట్ చేద్దామా అంటాడు. అప్పుడు అరవింద చాలామంది వచ్చారు వాళ్లని వెయిట్ చేయించడం అంత మంచిది కాదు కేక్ కట్ చేద్దాం అని చెప్పి అందరితో కలిసి కేక్ కట్ చేస్తుంది. ఇక అరవింద స్టేజ్ మీద నుండి కిందికి వచ్చి బాధపడుతుంది. ఇక పద్మావతి అరవింద దగ్గరికి వెళ్లి మీరు బాధపడకండి మీ ఆయన కేక్ కట్ చేయకుండా వెళ్లారు అనే కదా నీ బాధ కానీ ఆయన ఏదో ఒక మంచి పని కోసమే వెళ్లి ఉంటాడు ఈ కేక్ కట్ చేయడం ఇలాంటివన్నీ హంగులు ఆర్భాటాలు మాత్రమే నిజమైన భార్య భర్తల బంధం ప్రేమ, నమ్మకం తో ఉంటుంది. వాటికి ఈ ఆర్భాటాలు అవసరం లేదు. ఆ రోజు కూడా మీరు గుళ్లో మీ ఆయన కోసం ఎదురు చూశారు. కానీ వచ్చాడు కదా ఇప్పుడు కూడా అలాగే వస్తాడు అంటుంది.

Advertisement
Nuvvu Nenu Prema Aug 18 Today Episode
Nuvvu Nenu Prema Aug 18 Today Episode

భార్య భర్తల బంధం ప్రేమ ఆప్యాయత తో నిండి ఉంటుంది. ఇక్కడ అందరూ అంటుంటారు కదా మీ ఆయనకు మీరంటే చాలా ఇష్టమని నిజం కాదా చెప్పండి అంటుంది. అప్పుడు అరవింద ఇష్టమే అంటుంది. మరి మీరు ఎందుకు బాధ పడుతున్నారు మీ అనివర్సరీ నీ కూడా పక్కన పెట్టి ఆయన వెళ్లాలంటే మీరు అతన్ని అర్థం చేసుకుంటారని నమ్మకంతోనే కదా అతను బయటకి వెళ్లాడు. కేక్ ఇవాళ కాకపోతే రేపు కట్ చేయవచ్చు కానీ మీరు ఇవాళ చాలా సంతోషంగా ఉండాలి. మీరు బాధపడితే మీ ఆయన తట్టుకోలేడు అంటుంది.

ఇక అరవింద వాళ్ల నానమ్మ పద్మావతి దగ్గరకు వచ్చి చిన్న దానివి అయినా చాలా మంచిగా చెప్పావు. మా ఇంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టకుండా సంతోషంగా ఉండేలా చేశావు. కానీ ఇక్కడ కొంత మందికి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ల బుద్ధి ఎన్నడు మార్చుకోరు అంటుంది. నీ లాంటి ఆడపిల్ల కోడలిగా దొరకాలని అందరూ అనుకుంటారు ఇక నిన్ను చూసైనా నేర్చుకుంటే ఇప్పుడైనా బాధపడతారు అంటుంది. ఇక మాయ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి కూడా సరే బామ్మ గారు నాకు పని ఉంది అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి.

Read Also : Nuvvu Nenu Prema Serial : పద్మావతి నీతో మాట్లాడాలన్న విక్రమాధిత్య.. చేయి వదలండంటూ పద్మావతి ఫైర్.. అనూతో ఊహాల్లో అరవింద్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel