Intinti Gruhalakshmi: సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన తులసీ తల్లి.. తులసి పై మండిపడ్డ నందు..?

Updated on: April 16, 2022

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంకేంటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో అంకిత వాళ్ళ అమ్మ గాయత్రి తులసి ఇంటికి రావడంతో అంకిత వాళ్ళ అమ్మను తిట్టి అవమానించి పంపించేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి అంకిత తో మాట్లాడుతూ నువ్వు మీ అమ్మతో అలా మాట్లాడి ఉండకూడదు అంకిత లేదు ఆంటీ నేను చేసింది కరెక్టే అని అంటుంది అంకిత. అత్తారింట్లో సంతోషంగానే ఉన్నాను ఇంత వయసు వచ్చినా కూడా మా అమ్మకు మాట్లాడటం నేర్పించాలా? నేను ఇంట్లో పని మనిషిని కాదు కదా మిమ్మల్ని గౌరవించని వాళ్ళను నేను కూడా గౌరవించను అని అంటుంది అంకిత.

Advertisement

అప్పుడు తులసి ఇలా మాట్లాడితే నువ్వు శాశ్వతంగా పుట్టింటికి దూరం అయిపోతావు అని అనడంతో అదేమీ లేదు ఆంటీ అని ఉంటుంది అంకిత. దీంతో తులసి ఇప్పుడు ఉన్న సమస్యలు అన్నీ చాలవన్నట్లు తులసికి కొత్త సమస్య వచ్చి పడుతుంది. అప్పుడు తులసి ఆలోచనలో పడగా అప్పుడు అంకిత ఏం ఆంటీ ప్రేమ్ వాళ్ళ నాన్న పై తిరగబడ్డారని ఇంట్లో నుంచి తరిమేశారు ఇప్పుడు నేను మా అమ్మ పై తిరగబడి నందుకు నాకు అదే శిక్ష అని ఆలోచిస్తున్నారా అని అంటుంది అయ్యో అలా ఎప్పటికీ చేయను అని అంటుంది తులసి.

ఇంతలో తులసి ఇంటికి తన తల్లి వస్తుంది. అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో తులసీ తల్లి తులసికి గులాబీ మొక్కను బహుమతిగా ఇస్తుంది. ఆ గులాబీ మొక్కను చూసిన తులసి ఎమోషనల్ అవుతుంది. తనకు ఆ మొక్క అంటే ఎంతో ఇష్టం అని చెబుతుంది తులసి. మరొక వైపు ప్రేమకి పాటలు రాసే అవకాశం వస్తుంది. మరొకవైపు అంకిత తల్లి అభిని కలసి జరిగిందంతా వివరిస్తుంది.

అంతేకాకుండా అంకిత కోసం త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ కొన్నాను అని అది చేతికి ఆ ఇంటి బీగాలు అభి కి ఇస్తుంది. మరొక వైపు దివ్య పేరెంట్స్ మీటింగ్ కోసం అందరూ వచ్చి తులసితో మాట్లాడగా దివ్య బాధ్యత నాది మీటింగ్ కి రావాల్సిన అవసరం లేదు అని తులసి తో గొడవకు దిగుతాడు నందు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel