Viral news: ఆరేళ్ల కుమారుడి కోసం అధ్భుతమైన టైం టేబుల్.. అమ్మంటే అట్లుంటది మరి!

Viral news: మనం చదువుకునే రోజుల్లో టైం టేబుల్ పెట్టుకొని దాని ప్రకారమే చదువుకోవడం, ఆడుకోవడం, బడికి వెళ్లడం వంటివి చేసే వాళ్లం. అయితే దాన్ని ఫాలో అయ్యేందుతు తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా సాయం చేసే వాళ్లు. ఇలా టైమ్ టేబుల్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవడం వల్ల మంచి పద్ధతి వస్తుందని.. సమయం వృథా కాదని కూడా అందరూ నమ్ముతుంటారు. అయితే తన కుమారుడికి మంచి ప్రవర్తన, టైం విలువ నేర్పించాలనుకున్న ఓ తల్లి…. అతడి కోసం ప్రత్యేకంగా టైం టేబుల్ తయారు చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ టైమ్ టేబుల్ ఫొటో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రీడిట్ ఖాతాలో వైరల్ అవుతోంది. అయితే ఈ టైం టేబుల్ లో ఆ తల్లి.. 7.50 కి అలారం అని రాసి ఉండగా.. లేవడానికి పది నిమిషాల సమయాన్ని కూడా ఇచ్చింది. ఆ తర్వాత బ్రష్, టిఫిన్, టీవీ చూడటం. పండ్లు తినడం, ఆడడం, పాలు తాగడం, టెన్నిస్ ఆడటం, హోం వర్క్ చేయడం, డిన్నర్, క్లీనింగ్, నిద్రపోయే సమయం వరకు ఏమేం చేయాల్లో అన్నింటిని పొందుపర్చింది. అయితే ఇందులో ఉన్నట్లుగానే ఆ బాబు రోజూ గడిపితే… రివార్డుగా 10 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధానాన్ని వారం రోజులు ఫాలో అయితే 100 ఇవ్వనున్నట్లు వివరించారు. బాగుంది కదా.. మీరూ మీ పిల్లల కోసం ఇలా ఏదైనా కొత్తగా ట్రై చేయండి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel