Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Love story : లేచిపోతున్న కూతురును పట్టుకొచ్చి పెళ్లి చేసింది.. ఎవరితోనో తెలుసా?

Love story : బీహార్ రాజధాని పాట్నా శివార్లలోని దానాపూర్ లో ఓ ఆశ్చర్యకరమైన ప్రేమ పెళ్లి వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె వారిని వెంబడించి మర పట్టుకుంది. ప్రియురాలి తల్లి వారిని పట్టుకొని గట్టిగా అరవడం ప్రారంభించింది. దీంతో గ్రామస్థులు గుమిగూడారు. ప్రేమ జంటను ఇదేంటని ప్రశ్నించగా… తాము పెళ్లి చేసుకుంటామని, ప్రాణం పోయినా ఒకరినొకరు వదిలి ఉండమని ... Read more

By Vinod Kumar

Published on: July 5, 2022 7:00 AM

Updated on: July 5, 2022 7:31 AM

Mother mademarriage with daughters boy friend at bihar

---Advertisement---

Love story : బీహార్ రాజధాని పాట్నా శివార్లలోని దానాపూర్ లో ఓ ఆశ్చర్యకరమైన ప్రేమ పెళ్లి వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె వారిని వెంబడించి మర పట్టుకుంది. ప్రియురాలి తల్లి వారిని పట్టుకొని గట్టిగా అరవడం ప్రారంభించింది. దీంతో గ్రామస్థులు గుమిగూడారు. ప్రేమ జంటను ఇదేంటని ప్రశ్నించగా… తాము పెళ్లి చేసుకుంటామని, ప్రాణం పోయినా ఒకరినొకరు వదిలి ఉండమని చెప్పడంతో గ్రామస్థులంతా కలిసి వారికి పెళ్లి చేశారు. అయితే బాలిక తల్లి కూడా ఇందుకు ఒప్పుకోవడం గమనార్హం.

Mother mademarriage with daughters boy friend at bihar
Mother mademarriage with daughters boy friend at bihar

కర్పి పీఎస్ పరిధిలోని బెల్హెడా గ్రామానికి చెందిన సత్యేంద్ర పండిట్ కుమారుడు అనిల్ అర్వాల్… ఖేరిమోడ్ పీఎస్ పరిధిలోని కోడిహర గ్రామానికి చెందిన యోగేంద్ర పండిట్ కుమార్తె ఉందు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో లేచిపోవాలనుకున్నారు. విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వారిని వెంబడించి పట్టుకుంది. నిలబడ్డ చోటే గొడవ చేస్తూ అందరినీ పిలిచింది. గ్రామస్థులంతా వచ్చి వారి ఇష్ట ప్రకారం ప్రేమికులిద్దరికీ పెళ్లి చేశారు. అయితే వీరి పెళ్లికి బాలికి తల్లి ఒప్పుకోవడం, పారిపోయే వారి పెళ్లి రోడ్డు మీద అవడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.