Karthika Deepam january 21 Today Episode : కార్తీక్ ని చంపేయాలి అనుకున్న మోనిత.. మోనిత ఊహించని షాక్ ఇచ్చిన దీప?

Karthika Deepam january 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ వాళ్ళు మోనిత గురించి ఆలోచిస్తూ ఉంటారు..

ఈరోజు ఎపిసోడ్లో దీప ఆ మోనిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలి డాక్టర్ బాబు ఫోన్ని బట్టి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు కదా అనడంతో ఇంతలోనే వారణాసి దీపక్ ఫోన్ చేసి నీ అనుమానమే నిజమైంది దీపక్క ఇంట్లోనే ఉంది పాప కూడా క్షేమంగానే ఉంది అనడంతో ఇప్పుడే బయలుదేరుతున్న వారణాసి అని ఫోన్ కట్ చేస్తుంది. మరొకవైపు మోనిత గన్ను చూస్తూ నా ఓపిక సహనానికి నువ్వు పరీక్ష పెడుతున్నావు దీప ఆ దేవుడు నీ ప్రాణాలు తీసుకుపోతున్నాడు అనుకున్నాను కానీ నావల్ల కాదు చావు నా చేతుల్లోనే అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Karthika Deepam january 21 Today Episode
Karthika Deepam january 21 Today Episode

గన్ ని పక్కన పెట్టి బాక్స్ లో బాంబు ఓపెన్ చేసి నాకు దక్కని కార్తీక్ ని ఇంకెవ్వరికీ దక్కని ఇవ్వను కార్తీక్ ని చంపేస్తాను అనుకుంటూ ఉండగా ఇంతలోనే హిమ అక్కడికీ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు ఆంటీ అనడంతో ఏం లేదు హిమా మీ నాన్నని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను అనగా అదేంటి ఆంటీ మనం నైట్ ఇక్కడే ఉంటే నాన్న ఒప్పిస్తాను, ఒప్పుకుంటారు అన్నారు కదా అనగా ఒప్పుకోకపోతే రెండవ ప్లాన్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని హిమకు మాయ మాటలు చెప్పి లోపలికి పంపిస్తుంది. హిమ లోపలికి వెళ్ళగానే మోనిత మీ డాడీని ఒప్పిస్తాను కానీ మీ అమ్మను బ్రతికించడానికి కాదు నన్ను పెళ్లి చేసుకోవడానికి అనుకొని నవ్వుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు దీప దేవుడి దగ్గరికి వెళ్లి నేను నూరేళ్లు బతకాలి అనుకున్నాను కానీ నన్ను మధ్యలోనే తీసుకెళ్తున్నావు కానీ ఎందుకు అని అడగను నువ్వు ఏం చేసినా దాని వెనుక ఒక అర్థం ఉంటుంది కానీ నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అది ఎలా అయినా సక్సెస్ అయ్యేలా చూడు అని దీప కోరుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సౌందర్య, శౌర్య ఒక కారులో దీప,కార్తీక్ ఒక కారులో వెళుతూ ఉంటారు. అప్పుడు దీప ఎంత ధైర్యం డాక్టర్ బాబు నా బిడ్డనే కిడ్నాప్ చేస్తుందా అని కోపంతో మాట్లాడగా నువ్వేం టెన్షన్ పడకు దీప దాని దగ్గరికి వెళ్తున్నాము కదా అని అంటుంది.

హిమ మనసు పాడు చేసింది, నన్ను హిమ మనుసులో విలన్ చేసింది అనడంతో హిమను కాపాడుకోవాలి డాక్టర్ బాబు లేదంటే అది ఎంతకైనా తెగిస్తుంది అనగా నువ్వేం బాధపడకు దీప నేను ఆ మోనిత లొంగిపోను నా బిడ్డను కాపాడుకుంటాను అంటాడు కార్తీక్. తర్వాత సౌందర్య శౌర్య కార్లు వెళుతుండగా ఎందుకు నానమ్మ ఆ మోనిత ఇలా చేస్తోంది అనగా ముందు నుంచి తెలిసింది కదా దానికి మీ నాన్న కావాలంట అనగా అంటే నాన్నని ఇవ్వకపోతే హిమను ఇవ్వదా అనగా దాని మొహం దానికి వేయాల్సిన నాలుగు ఇస్తే వెళ్ళిపోతుంది అని అంటుంది సౌందర్య. ఆ తర్వాత దీప, కార్తీక్ వారణాసి ముగ్గురు కలిసి మోనిత ఇంట్లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా ఇంతలోనే మోనిత హిమ తలపై పెట్టి ఇస్తాను అని బెదిరిస్తూ బయటకు వస్తుంది.

Karthika Deepam january 21 Today Episode
Karthika Deepam january 21 Today Episode

అప్పుడు నా కూతురు ఏం చేయకు ప్లీజ్ మోనిత అని దీప ఏడుస్తూ ఉండగా మోనిత సంతోషపడుతూ ఉంటుంది. సౌందర్య శౌర్య కూడా అక్కడికి రావడంతో మీకోసమే ఎదురుచూస్తున్నానా ఆంటీ రండి అనడంతో మర్యాదగా నా మనవరాలుని వదిలిపెట్టు అనడంతో ఎలాగో కుటుంబం అందరూ ఒకే చోట ఉన్నారు జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒక విషయం చెప్పండి అంటుంది మోనిత. దీప నీకు రెండు అవకాశాలు మీ భర్తని నా దగ్గరికి పంపించి నీ బిడ్డను కాపాడుకో భర్త కావాలా బిడ్డ కావాలా అనడంతో దీపఎమోషనల్ అవుతుంది. నాకు ఇచ్చి పెళ్లి చేయి నీ బిడ్డను ఏమీ చెయ్యను అని అంటుంది మోనిత.

Advertisement

ఇప్పుడు దీప ఏడ్చి సరే మోనిత నువ్వు చెప్పినట్టు చేస్తాను నా డాక్టర్ బాబును నీకు అప్పగిస్తాను అనడంతో కార్తీక్ సౌందర్య ఇద్దరు షాక్ అవుతారు. ఆ మాట విన్న మోనిత సంతోష పడుతూ ఉంటుంది. ఏంటి దీప నువ్వు చెప్పేది నిజమా అనగా అవును మోనిత అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ దీప అని కార్తీక్ అనడంతో నా బిడ్డను కాపాడుకోవాలంటే మనం ఈ పని చేయాల్సిందే డాక్టర్ బాబు అంటుంది. మనిత నేను చెప్పేది విను నా డాక్టర్ బాబు నీకు అప్పగించేస్తాను.

హిమను నాకు ఇచ్చేసేయ్ అనడంతో సరే దీపా ఇదంతా నిజమా అనగా నువ్వు చెప్పిన తర్వాత నేను బాగా ఆలోచించాను నీ దగ్గర ఉంటేనే నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది డాక్టర్ బాబును నువ్వే పెళ్లి చేసుకో నాకు దీన్ని క్షేమంగా డాక్టర్ బాబుకి అప్పగించు అనడంతో మోనిత సంతోష పడుతూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే దీప మోనిత చేతిలో ఉన్న గన్ను తీసుకొని హిమను కాపాడుకుని ఆ గన్ తో మోనితకె గురిపెడుతుంది. ఎంత పని చేశావు దీప అనగా దగ్గరికి రావద్దు చంపేస్తాను అనడంతో మోనిత షాక్ అవుతుంది..

Read Also :Karthika Deepam january 20 Today Episode : హిమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. కోపంతో రగిలిపోతున్న సౌందర్య? 

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel