Karthika Deepam june 28 Today Episode : శోభ చెంప చెళ్లుమనిపించిన హిమ.. స్వప్నకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జ్వాలా?

Updated on: June 28, 2022

Karthika Deepam june 28 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉండడంతో అది చూసి జ్వాలా ఆశ్చర్య పోతుంది.

ఈరోజు ఎపిసోడ్ లు జ్వాలా, సీసీ నాకు థాంక్స్ చెప్పే అలవాటు లేదు అని అనగా వెంటనే సౌందర్య నిన్ను ఎవరు తయారు చెప్పమన్నారు అని చెప్పి ఒక గిఫ్ట్ను ఇస్తుంది సౌందర్య. ఆ గిఫ్ట్ ను చూసి జ్వాల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ గిఫ్ట్ లో జ్వాల చింపిన బొమ్మను అతికించి ఉంటుంది.

Karthika Deepam june 28 Today Episode
Karthika Deepam june 28 Today Episode

అప్పుడు జ్వాలా,నిరుపమ్ అన్న మాటలు తలుచుకొని ఆ మాటలకు కారణం హిమ అని హిమ పై కోపం పడుతుంది. కానీ సౌందర్య మాత్రం ఏమీ అనలేక అలాగే మౌనంగా ఉండి పోతుంది. జ్వాల కోసంతో మరింత రెచ్చిపోగా అప్పుడు సౌందర్య ధైర్యం చెప్పి ఓదారుస్తుంది. మరొక వైపు హిమ శోభ చెంప చెళ్లుమనిపించి, ఇంకొక్క వాళ్ళ జోలికి ఫోన్ చేస్తే మా బావకు అసలు విషయం చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తుందిఅయితే అదంతా కూడా శోభ కలగంటుంది..

Advertisement

మరొకవైపు సౌందర్య,జ్వాలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సౌందర్య ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు కలిసి మాట్లాడతాను అని అనగా వద్దు అని అంటుంది జ్వాలా అప్పుడు సౌందర్య చేతి గోరింటాకు పెడతాను అని అనడంతో జ్వాలా అందుకు సరే అని అంటుంది.

ఆ తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు జ్వాలా ఇంట్లోకి వెళ్లి అద్దం వైపు చూస్తూ నిరుపమ్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరొకవైపు నిరుపమ్, స్వప్న ఇద్దరు ఇంటికి వెళ్ళగా అక్కడ జ్వాలా ఆటో చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు స్వప్న ఏంటి డైరెక్ట్ ఆటో ఇంట్లో వేసుకునే వచ్చావు అని అనగా అప్పుడు ద్వారా కొన్ని లెక్కలు తేలాలి అని అంటుంది.

అప్పుడు స్వప్న ఎక్కువ మాట్లాడడంతో నేను డాక్టర్ సాబ్ తో పని ఉంది లెక్కలు తేలాలి అని చెప్పాను కదా మీరు ఎక్కువ చేయకండి అని అనడంతో స్వప్న,జ్వాల చెంప చెల్లు మనిపిస్తుంది అప్పుడు నిరుపమ్ ఏమయింది అని అడగగా జ్వాలా తన ఆటోని నిరుపమ్ కి అప్పగించి వెళుతుంది.

Advertisement

అప్పుడు జ్వాలా ఇంకొకసారి నా మీద చేయి చేసుకుంటే మర్యాదగా ఉండదు అంటూ స్వప్నకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నిరుపమ్, స్వప్న పెళ్లి పత్రికలు ఎవరెవరికి ఇవ్వాలి అని వాళ్ళ పేర్లు రాస్తూ ఉండగా,ఇంతలో శోభ అక్కడికి వచ్చి జ్వాలా ఆటోని చూసి ఆశ్చర్య పోతూ ఉంటుంది.

ఇక లోపలికి వెళ్లి వాళ్ళని పలకరించగా వాళ్ళు పెళ్లి పనులు చేస్తుండడంతో శోభ కుళ్ళుకుంటూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో జ్వాలా ఇంటికి సౌందర్య హిమను తీసుకురావడంతో,జ్వాలా కోపంతో హిమను బయటకు గెంటేస్తుంది. అప్పుడు సౌందర్య, ఆనంద్ రావ్ లను ఇంకొకసారి మా ఇంటికి రా వద్దండి నా బతుకును బతకనివ్వండి అని చెప్పి వారి ముఖం మీదే తలుపులు వేస్తుంది.

Read Also : Karthika Deepam june 27 Today Episode : నిరుపమ్ చేసిన పనికి షాక్ అయిన హిమ.. దగ్గరవుతున్న జ్వాలా, సౌందర్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel