MLA Roja: అసెంబ్లీ లో కన్నీళ్లు పెట్టుకున్న రోజా… కారణం అదే!

Updated on: March 9, 2022

MLA Roja: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాప తీర్మానం ప్రకటించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి గౌతమ్ రెడ్డిని గుర్తు చేసుకుని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు అనే విషయాన్ని, ఆయన లేని లోటును పూడ్చలేమని జగన్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే,ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న రోజా గౌతమ్ రెడ్డి మృతుని తలుచుకుని అసెంబ్లీ సాక్షిగా కన్నీటిపర్యంతమయ్యారు.

అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రోజా మాట్లాడుతూ.. మంత్రి గౌతమ్ రెడ్డి గురించి ఈరోజు ఇలా మాట్లాడుకోవడం ఎంతో దురదృష్టమని ఆమె వెల్లడించారు.ముఖ్యమంత్రిగా జగనన్న క్యాబినెట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న మంత్రిగా ఉన్న రెండేళ్లపాటు తాను ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా ఉన్నాను. ఆయన ఎప్పుడూ కూడా తనని ఒక సొంత చెల్లిగా భావించేవారని ఆయన ఎప్పటికప్పుడు తనని గైడ్ చేసే వారిని ఈ సందర్భంగా రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

గౌతమ్ రెడ్డి ఒక బాహుబలి అని అలాంటి వ్యక్తి క్షణాల్లో మాయం అయ్యారనే విషయం,ఆయన ఇకపై మనతో లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని గుర్తు చేసుకుని రోజా అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నారు. గౌతమ్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారని ఆయనను తలుచుకుని రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel