Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Vijayawada Suicide Case : విజయవాడలో బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌.. టీడీపీ నేత అరెస్ట్..!

Vijayawada Suicide Case : లైంగిక వేదింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో కలకలం రేపుతోంది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతుంది. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక సూసైడ్​ నోట్​లో ... Read more

By Ramesh Babu

Published on: January 30, 2022 5:30 PM

Updated on: January 30, 2022 5:56 PM

---Advertisement---

Vijayawada Suicide Case : లైంగిక వేదింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో కలకలం రేపుతోంది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతుంది. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక సూసైడ్​ నోట్​లో రాసింది. ఈ విషయాన్ని ఏసీపీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినోద్ జైన్ పై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్​ల ప్రకారం కేసులను పెట్టామని ఏసీపీ హనుమంతరావు స్పష్టం చేశారు. వినోద్ జైన్ లైంగిక వేధింపుల కారణంగానే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

2 నెలలుగా లైంగిక వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య..
బాలిక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్​ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. విచారణ కోసం ఇప్పటికే వినోద్​ జైన్​ ఇంటిని సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. గత 2 నెలలుగా వినోద్​జైన్ బాలికను లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక క్షోభతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. ఈ విషయాలు బాలిక సూసైడ్ నోట్ లో రాసిందని ఏసీపీ తెలిపారు. అపార్ట్ మెంట్ లిఫ్ట్​లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వినోద్ జైన్ వేధించేవాడని సూసైడ్​ నోట్​లో రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బాలిక ఆత్మహత్య ఘటనపై వైసీపీ నేతల కామెంట్స్  :
ఈ ఆత్మహత్య ఘటనపై ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కూడా స్పందించారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె రాసిన సూసైడ్ నోట్ లో అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే రోజా కోరారు. అలానే మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కూడా ఈ ఘటనపై స్పందించారు. బాలిక సూసైడ్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక సూసైడ్‌ నోట్‌లో రాసిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసుల విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనకు కారణమైన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.

Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.