Guppedantha Manasu: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి వసును కలిసిన ప్రతి సారి నాకెందుకో కొత్తగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. రిషి సార్ ను కలిసిన ప్రతి సారి ఏదో తెలియని ఉత్సాహం పెరుగుతుంది అని వసు అనుకుంటుంది.

ఆ తర్వాత దేవయాని రిషి, సాక్షి లా పెళ్లి గురించి ఆలోచించారా అని జగతి దంపతులతో అంటుంది. దాంతో జగతి ఈ విషయంలో రిషి నిర్ణయం మాత్రమే పనిచేస్తుంది అన్నట్లు చెబుతుంది. ఇక దేవయాని సాక్షి లాంటి అమ్మాయి ని వదులుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది అని అంటుంది. ఇప్పుడు మీ శిష్యురాలి ని దూరం పెట్టి నీ కొడుకు గురించి ఆలోచించు అని దేవయాని జగతి తో అంటుంది.
మరోవైపు రిషి రాసిన లెటర్ చదువుకుంటూ ఉంటాడు. ఇంత అందంగా ఈ ప్రేమ లేఖ ఎలా రాయగలిగాను అని అనుకుంటాడు. అది గమనించిన మహేంద్ర జగతి కి చెబుతాడు. ఇక రిషి బయటికి వెళ్లగా.. మహేంద్ర జగతి ను ఆ గదిలోకి తీసుకుని వచ్చి ఆ లెటర్ చూపిస్తాడు. ఇక ఆ లెటర్ వసు కు రిషి నే రాసాడు అని తెలిసి.. ఇద్దరూ ఎంతో ఆనందపడతారు. ఆ తర్వాత రవింద్ర రిషి కు సాక్షి వాళ్ళ ఫాదర్ కాల్ చేశాడు అని చెబుతాడు.
దాంతో రిషి ఆ టాఫిక్ లో నేను ఏం మాట్లాడలేను పెదనాన్న అని చెబుతాడు. దాంతో జగతి మనసులో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. మరోవైపు వసు రిషి క్యాబిన్ సర్ది పెడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడ రిషి కూడా వెళ్తాడు. మరో వైపు సాక్షి కారులో ఈరోజు ఎలాగైన రిషి ను కలవాలి అని అనుకుంటుంది. ఇక వసు సర్దుతున్న క్రమంలో బుక్ కిందపడి పోతుండగా దాన్ని రిషి, వసు లు పట్టుకుంటారు.
ఈ క్రమంలో ఒకరికొకరు అందంగా చూసుకుంటారు. ఈలోపు అక్కడకు సాక్షి వస్తుండగా.. రిషి వసును అక్కడి నుంచి ఒక చోటికి తీసుకుని వెళతాడు. ఆ తర్వాత రిషి నా ఇష్టాన్ని దూరం చేయడం లో నువ్వు నాకు సహాయం చేస్తావా? అని వసు ను అడుగుతాడు. దానికి వసు ఆలోచిస్తూ ఉండగా రిషి వెళ్ళి పోతూ ఉంటాడు. ఈ క్రమంలో వసు రిషి చేయి గట్టిగా పట్టుకొని మీ అయిష్టాన్ని దూరం చేయడానికి మిమ్మల్ని నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.
- Guppedantha Manasu Aug 17 Today Episode : నన్ను రిషి అని పిలువు అని చెప్పిన రిషి.. సంతోషంలో జగతి..?
- Guppedantha Manasu Dec 10 Today Episode : వసుధారకి ధైర్యం చెప్పిన రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
- Guppedantha Manasu May 28 Today Episode : రిషి మనసు ముక్కలు చేసిన వసు.. రిషి లైఫ్ లో నుంచి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇచ్చిన సాక్షి..?















