Guppedantha Manasu March 9th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రిషి, క్యాబిన్ నుంచి జగతి ఏడ్చుకుంటూ వెళ్లిపోవడంతో అది చూసిన మహేంద్ర రిషి పై విరుచుకు పడతాడు. జగతిని ఎందుకు బాధ పెట్టావు. నిన్ను కనడమే జగతి చేసిన తప్ప అని కోప్పడతాడు. అప్పుడు రిషి,డాడ్ నేను విచక్షణ విజ్ఞత లేకుండా మాట్లాడలేదు అని అనగా.. అప్పుడు మహేంద్ర అంత మర్యాదగా అవమానించావా మీ అమ్మను అని అంటాడు.
అప్పుడు రిషి నాకు అమ్మ అనే అదృష్టం లేదు అని చెప్పగా, ఇన్నాళ్లుగా నన్ను డాడ్ అని పిలవడం జగతిని మేడం అని పిలుస్తున్నావు కదా ఆ ఒక్క పదం చాలా ఆమె గుండె బద్దలవ్వడానికి అని అంటారు మహేంద్ర. మరొకవైపు వసుధార, జగతి కారులో వెళుతుండగా మధ్యలో దేవయాని కారుకి అడ్డుపడుతుంది.

జగతి కి జరిగిన అవమానాన్ని దెప్పి పొడుస్తూ ఆరోగ్యం బాగుందా అని వెటకారం గా మాట్లాడుతుంది. కోపంతో రగిలిపోయిన వసు తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ, దేవయానిపై విరుచుకుపడుతుంది. తల్లి కొడుకుల బంధాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేరు అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వెళుతుంది వసుధార. మరొకవైపు రిషి తండ్రి మహేంద్ర అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
ఇక వసుధార, జగతికి తీసుకొని వస్తుంది.. ఆ తర్వాత కొద్ది సేపు వారిద్దరూ జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో జగతి ఇంటికి వచ్చిన రిషి మీ మేడమ్ కి ఒక పని అప్పజెప్పారు అది ఎంతవరకు వచ్చిందో అడుగు అని వసు తో అంటాడు. అప్పుడు నేను ఎందుకు అడగాలి సార్ అంటూ వసు కోప్పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu March 8th Today Episode : దేవయానిఫై విరుచుకుపడ్డ వసుధార.. రిషి ఏం చేయనున్నాడు..?
- Guppedantha Manasu Nov 30 Today Episode : దేవయానికి చుక్కలు చూపిస్తున్న ధరణి.. జగతితో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి.?
- Guppedantha Manasu: మరింత దగ్గరవుతున్న వసు,రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
- Guppedantha Manasu june 28 Today Episode : స్కాలర్ షిప్ టెస్ట్ లో టాప్ వన్ లో వసు.. దగ్గరవుతున్న వసు, రిషీ..?













