Kaccha badam singer: తలపొగరు దిగింది.. ఇకపై బుద్ధిగా ఉంటానంటున్న కచ్చా బాదమ్ సింగర్!

ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన కచ్చా బాదామ్ సింగర్ గరించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్, డబ్బుతో తనకు పొగరు ఎక్కువైంది… అదే తన కొంప ముంచిదని కచ్చా బాదామ్ సింగర్ భూబన్ బద్వాకర్ తెలిపారు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లోని లక్ష్మీనారాయణ పూర్ కురల్జురీ గల్లీల్లో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే ఆయన కచ్చా బాదమ్ పాటతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. అయితే ఒక్క పాటతో చిన్నపాటి సెలబ్రిటీ అయిన భూబన్… పాటకు పేటెంట్ హక్కులంటూ కోర్డు గడపను కూడా తొక్కాడు.

అంతే కాదు ఆయన సెకండ్ హాండ్ కారు కొనక్కున్నాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో కూడా ఉన్నాడు. అయితే ఒక్క పాటతో, డబ్బుతో వచ్చిన ఫేమ్ వల్ల తనకు గర్వం తలకెక్కిందని.. అందువల్లే ప్రమాదం జరిగిందంటూ ఒ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఇక నుంచి తాను బుద్ధిగా ఉంటానని చెప్పాడు. సాధారణ జీవితాన్ని గడుపుతానని వివరించాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel