Intinti gruhalakshmi : రోజురోజుకూ తగ్గిపోతున్న ఇంటింటి గృహలక్ష్మీ టీఆర్పీ రేటింగ్..!

Updated on: June 27, 2022

Intinti gruhalakshmi : బుల్లితెరపై తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం టీఆర్పీ రేటింగ్ తో సంచలనం సృష్టించింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోల షోలకు, సినిమాలకు ధీటుగా నిలిచి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ వంటలక్క ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే అదే కథను తిప్పి తిప్పి చూపిస్తే.. కచ్చితంగా చూడడం మానేస్తారని చెప్పడానికి ఆ సీరియల్ యే ప్రత్యేక నిదర్శనం. కార్తీక దీపం ఆదరణ కోల్పోయినప్పటి నుంచి ఇంటింటి గృహలక్ష్మీ, గుప్పెడంత మనసు సీరియల్ లకు టీఆర్పీ పెరుగుతూ వచ్చింది. అయితే గృహలక్ష్మీ సీరియల్ కి కూడా అదే కథను తిప్పి తిప్పి చెప్పడంతో దానికి కూడా ఆదరణ కరువవుతోంది.

Intinti gruhalakshmi serial trp rating decreased
Intinti gruhalakshmi serial trp rating decreased

గత రెండు వారాలుగా ఇంటింటి గృహలక్ష్మి టీఆర్పీ రేటింగ్ చాలా వరకు తగ్గిపోయింది. తాజాగా విడుదలైన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కి 10.01 రేటింగ్ వచ్చింది. నాల్గవ స్థానానికి పడిపోయింది. మొన్నటి వరకు సెకండ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరిపోయింది. దీనికి కారణం ఈ సీరియల్ మొత్తం తులసిపైనే ఆధారపడి సాగడం.. ఎప్పుడూ లాస్య చేతిలో ఆర్థికంగా మోసపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే రొటీన్ కు భిన్నంగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు. కానీ ఇది ఎప్పటిలాగే ఉండటంతో ఆకట్టుకోలేకపోతుందని తెలుస్తోంది.

సీరియల్ లో తులసి పాత్ర తప్ప మిగిలిన పాత్రలు, సన్నివేశాలను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నట్లు టాక్. అందుకనే మహిళలు ఆకట్టుకున్న ఈ సీరియల్ మెల్లగా దూరం అవుతోంది. తాజాగా తులసి డబ్బులను లాస్ మోసం చేసి తీసుకున్నట్లు చూపించారు. మరి ఇప్పుడు తులసి ఆ డబ్బులను ఎలా తిరిగి పొందుతుందనేది సస్పెన్స్ గా క్రియేట్ చేశారు. మరి ఈ ట్విస్ట్ అయినా ఆ సీరియల్ రేటింగ్ కు బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి.
Read Also :  Intinti Gruhalakshmi june 27 Today Episode : నందుకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన తులసి.. సంతోషంతో పార్టీ చేసుకుంటున్న భాగ్య లాస్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel