Karthika Deepam: కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. మోనితకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వంటలక్క..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత దీప కి వార్నింగ్ ఇస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత కార్తీకి నీకు ఎటువంటి సంబంధం లేదు అని నేను చెప్పినా కూడా కార్తీక్ వినిపించుకోకుండా నీతో కలిసి దీపాలు వెలిగించాడు చూడు అది నాకు కోపంగా ఉంది అని అనటంతో వెంటనే దీప నా భర్త నాతో దీపాలు వెలిగిస్తే నీకేంటి అని అనడంతో అని భర్త కాదు నా భర్త నా ప్రియుడు నా కార్తీక్ అని అంటుంది మోనిత. అప్పుడు మోనిత నిన్ను నీ డాక్టర్ బాబులో ఎవర్నో ఒకరిని చంపేస్తాను అని అనటంతో వెంటనే దీప ఆ దేవుడు సన్నిధిలో చెబుతున్నాను ఇంకొక్క మాట డాక్టర్ బాబు గురించి తప్పుగా మాట్లాడితే నేను నిన్ను ఆ అమ్మవారికి బలి ఇస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

Advertisement

మరోవైపు హిమ బాబుతో ఆడుకుంటూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి మీ నానమ్మ వస్తుందమ్మా అనడంతో హిమ సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు మీ నాన్నమ్మ మనం అక్కడికి తను లేకుండా వెళ్లినందుకు కోప్పడుతుంది మోనిత గురించి భయపడుతుంది అనడంతో మోనిత మనల్ని ఏం చేస్తుంది తాతయ్య చూశారు కదా బాబు ని తీసుకుని వచ్చి రెండు రోజులు అవుతున్న ఇంతవరకు ఫోన్ చేయలేదు అని అంటుంది. మరొకవైపు దీప కార్తీకదీపాలు వెలిగిస్తూ ఉండగా ఇంతలో వెనుక వైపు వచ్చిన మోనిత దీప అన్నమాటలు గుర్తు తెచ్చుకొని దీపను నీటిలో తోసేయాలి అని చూస్తూ ఉండగా ఇంటర్నే కార్తీక్ అక్కడికి వచ్చి మౌనిత అని గట్టిగా అరిచి ఏం చేస్తున్నావు తెలుసా అని అంటాడు.

వంటలక్కని చంపేస్తావా అనడంతో నాకు నీకు మధ్య ఎవరైనా అడ్డుగా వస్తే చంపేస్తాను అని అంటుంది మోనిత. అప్పుడు మోనిత మరి నువ్వు ఈ వంటలక్క తో ఎందుకు కలిసి దీపాలు వెలిగించావు కార్తీక్ అనడంతో నిన్ను నువ్వు పూజ కోసం డబ్బులు ఇచ్చావు నేను ఈరోజు పూజలో హెల్ప్ చేశాను మోనిత అంతే అనడంతో మోనిత దీప కార్తీక్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా వెంటనే దీప ఇది గుడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మోనిత అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మోనిత ఈరోజుతో మీ ఇద్దరి ఆట కట్టించాలి అని ఈ దేవుడు సన్నిధిలో ఇకపై ఈ దీపతో మాట్లాడను కలవను అని నాకు మాట ఇవ్వు అనడంతో దీప,కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు.

అప్పుడు కార్తీక్ మౌనంగా ఉండేసరికి వెంటనే మోనిత అక్కడే ఉన్న దీపాన్ని తీసుకుని నువ్వు నాకు మాట ఇవ్వకపోతే నన్ను నేను తగలబెట్టుకొని చచ్చిపోతాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. వెంటనే దీప చచ్చిపోవే ఎవడి కోసం అని అంటుంది. ఇంతకుముందు లాగే డాక్టర్ బాబు నన్ను కలుస్తారు మాట్లాడుతాడు చచ్చిపోవే అనడంతో షాక్ అవుతుంది. నువ్వు చస్తావా లేకపోతే నన్ను తగలబెట్టామంటావా అని అనడంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మోనిత నాకే వార్నింగ్ ఇస్తావా రేపు ఈ సమయానికి నువ్వు నీ డాక్టర్ బాబులు ఎవరో ఒకరు మాత్రమే మిగులుతారు అని వార్నింగ్ ఇస్తుంది.

Advertisement

మరొకవైపు శౌర్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చంద్రమ్మ దంపతులు అక్కడికి వచ్చి కావాలనే సౌర్యకి వినిపించే విధంగా మాట్లాడుతూ దొంగ ప్రేమలు చూపిస్తూ ఉంటారు. చంద్రమ్మ దంపతులు మాటలు నిజమేఅని నమ్మిన సౌర్య ఇంద్రుడిని హత్తుకొని స్వారీ బాబాయ్ అని ఎమోషనల్ వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్రమ్మ మొత్తానికి శౌర్యమ్మ మనల్ని నమ్మింది ఇక తన అమ్మానాన్నలను మరిచిపోయేలా చేయడమే మన పని అంటుంది. ఆ తర్వాత దీప మోనిత అన్న మాటలు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ దీప కోసం టిఫిన్ తీసుకుని వచ్చి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావు ఏదైనా తిను లేకపోతే కళ్ళు తిరుగుతాయి అని అంటాడు.

అక్కడికి వచ్చిన మోనిత నేను కూడా పొద్దున్నుంచి ఉపవాసమే ఉన్నాను కదా కానీ నన్ను మాత్రం అడగలేదు అని కోపంగా రగిలిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరిసటి రోజు ఉదయం దీప గుడి శుభ్రం చేస్తూ ఉండగా పూజారి అక్కడికి వచ్చి అధైర్య పడకు కాస్త ఓపికతో ఉండు ఆ దేవుడు నువ్వు కోరుకునేది నెరవేరుస్తాడు అని అంటాడు. మరోవైపు మోనిత ఇంట్లో దీప కార్తిక్ ల విషయం గురించి తలుచుకొని నేను కూడా ఉపవాసమే ఉన్నాను కనీసం నన్ను పట్టించుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel