Intinti Gruhalakshmi Oct 28 Today Episode : నందు,అనసూయ మాటలకు కుమిలిపోతున్న తులసి.. అభి పై మండిపడ్డ ప్రేమ్..?

Updated on: October 28, 2022

Intinti Gruhalakshmi Oct 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు కావాలనే తులసి ఫైల్ లేనిపోని నిందలు వేస్తూ తులసిని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఆ వీడియో చివర్లో సామ్రాట్ గారి పడిపోతారు అని అనగా వెంటనే నందు తాను పడిపోవటం కాదు అతని కౌగిలిలో నువ్వు పడిపోయావు కదా అంటూ తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యుండి ఏం చేస్తున్నావు నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అని అనగా తులసి మిస్టర్ నందగోపాల్ అని గట్టిగా అరుస్తుంది.

Intinti Gruhalakshmi Oct 28 Today Episode
Intinti Gruhalakshmi Oct 28 Today Episode

అనసూయ ఎందుకు అరుస్తున్నావు తులసి మందు చెప్పింది నిజమే కదా నువ్వు ఇంతలా దిగజారి పోతావు ఇంతలా మారిపోతావ్ అనుకోలేదు అని అంటుంది. అప్పుడు తులసి అనసూయ దగ్గరికి వెళ్లి నన్ను మీరు అనుమానిస్తున్నారా అత్తయ్య మీ ఇంటికి కూడా వచ్చి నేను పాతికేళ్ళు అయింది ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు అయినా తప్పుగా ప్రవర్తించానా తప్పు పని చేశానా అని నిలదీస్తుంది.

అప్పుడు అనసూయ అప్పుడు ఉన్న తులసి వేరు ఇప్పుడు ఉన్న తులసి వేరు ఇప్పుడున్న తులసిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని అంటుంది. అప్పుడు ఇన్ని మాటలు అంటున్నారు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రేమ్ అని అనగా వెంటనే అభి అందులో తప్పేముంది నిజమే కదా అని అనగా వెంటనే ప్రేమ్ అభికి వార్నింగ్ ఇస్తాడు.

Advertisement

Intinti Gruhalakshmi : గుండె పగిలిన తులసి ఇల్లు వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది..

అప్పుడు లాస్య వాళ్ళిద్దర్నీ హద్దుల్లో ఉండమని చెప్పు నందు అని అనటంతో నందు తల్లి హద్దుల్లో లేదు అటువంటిది ఇంకా వాళ్లు కానీ ఏం చేస్తారు అని అంటాడు నందు. అప్పుడు తులసి నేను మీకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏమన్నా అనుకోండి అని అంటుంది తులసి. మరొకవైపు సామ్రాట్ ఇంట్లో కంగారు పడుతూ ఉంటాడు.

వాళ్ళ బాబాయ్ తో జరిగిన విషయాన్ని చెప్పి అక్కడ తులసి గారు ఎన్ని నిందలను మోస్తున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. తులసి మీరు ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకోను అని అనగా వెంటనే అనసూయ తప్పు చేసిన వాళ్ళు ఇలాగే ఉంటారు తులసి నువ్వు తప్పు చేశావు హద్దులు దాటావు స్పష్టంగా తెలుస్తోంది అనటంతో చాలు ఆపండి అత్తయ్య గారు ఈ పాతికేళ్లలో మీతో ఈ మాట అనిపించుకుంటాను అని నేను అప్పు ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది.

heartbroken Tulasi decides to leave the house in todays intinti gruhalakshmi serial episode
heartbroken Tulasi decides to leave the house in todays intinti gruhalakshmi serial episode

ఇంత జరిగిన తర్వాత ఇక్కడే ఉంటే నా మీద నాకే సహాయం చేస్తుంది. ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను అని అనడంతో వెంటనే లాస్య ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నావు తులసి ఇప్పుడు ఇక్కడ నుంచి సామ్రాట్ దగ్గరికి వెళ్లి పోవాలి అని ప్లాన్ వేసావా అంటూ లాస్య చీప్ గా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. తులసి ఒక్క క్షణం కూడా ఉండను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi Oct 26 Today Episode : పార్టీలో ఎంజాయ్ చేస్తున్న సామ్రాట్, తులసి.. కోపంతో రగిలిపోతున్న నందు..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel