Guppedantha Manasu Dec 3 Today Episode : గౌతమ్ మీద కోపంతో రగిలిపోతున్న రిషి.. వసుని నానా మాటలు అన్న దేవయాని.?

Guppedantha Manasu Dec 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో రిషి గౌతమ్ పై మండిపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి నన్ను ఫూల్ చేసావ్ రా నీకు ఎన్ని కారణాలు అయినా ఉండవచ్చు కానీ ఫ్రెండుని మోసం చేస్తావా అంటూ ఎమోషనల్ గా మాట్లాడతాడు రిషి. అప్పుడు గౌతమ్ నా మాట వినురా అని అనగా నువ్వు మాట్లాడకు అని అంటాడు రిషి. దాని కంటే నన్ను కత్తితో పొడిచి చంపి ఉంటే ఇంకా బాగుండేది కదరా అని అంటాడు రిషి. నిజం చెప్తున్నాను అంకుల్ నన్ను చెప్పొద్దని ఆపారు రా అనడంతో నీ మాటలు వినను అని కోప్పడతాడు రిషి.

Guppedantha Manasu Dec 3 Today Episode
Guppedantha Manasu Dec 3 Today Episode

నన్ను నమ్ము రా ప్లీజ్ అనడంతో నువ్వు మిత్ర దోహివి అని అంటాడు రిషి. కావాలంటే నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు అంతేకానీ నన్ను ఫ్రెండ్ గా దూరం పెట్టవద్దు అనడంతో ఫ్రెండ్షిప్ అనేది గొప్ప పదం అని గౌతమ్ మీద సీరియస్ అవుతాడు రిషి. ఆ తర్వాత రిషి గౌతమ్ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషి ఇద్దరు కారులో వెళుతుండగా జరిగిన విషయాలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గౌతం. వాడు నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ వసు వాడు నన్ను కూడా మోసం చేశాడు అనడంతో వెంటనే వసు సార్ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు.

Guppedantha Manasu Dec 3 Today Episode : రిషిని పిలిచిన మహేంద్రా.. 

ఇందులో కేవలం గౌతం సార్ తప్పు మాత్రమే కాదు మహేంద్ర సార్ వాళ్ళది కూడా ఉంది అనడంతో రిషి వెంటనే కారు పక్కకు ఆపి ఏం మాట్లాడుతున్నావ్ వసుధర నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని అనగా గౌతమ్ సారు నీకు చెప్పద్దు అని మహేంద్ర సార్ చెప్పాడేమో అందుకే సార్ చెప్పలేదేమో అని అనగా నువ్వు ఎన్నైనా చెప్పు వసుధార గౌతమ్ నాతో చెప్పకపోవడం నిజంగా మోసమే అని అంటాడు రిషి. మరొకవైపు దేవయాని రిషి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

Advertisement

వెళ్ళిపోయింది అనుకున్న జగతి మళ్ళీ తిరిగి వచ్చింది ఈ వసుధార రిషి ఏమో అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని. ఇంతలోనే వసుధర రిషి ఇంటికి రావడంతో రిషి కోపంతో పైకి వెళ్ళిపోగా ఇంతలో అక్కడికి దేవియాని వచ్చి వసుధారని అడ్డుకుంటుంది. అప్పుడు దేవయాని జగతి వసు ల గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసుధార ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.

మరొకవైపు రిషి మహేంద్రా రూమ్ దగ్గరికి వచ్చి తొంగి చూసి వెళ్తుండగా మహేంద్ర లోపలికిరా రిషి అని పిలుస్తాడు. ఏమైంది రిషి ఏంటి అవతారం అనడంతో డాడ్ నా షర్టు పాడవడంతో గౌతమ్ ఇంటికి వెళ్లాను అక్కడ నాకు అసలు విషయం తెలిసిపోయింది మీరు అక్కడే ఉన్నారన్న విషయం నాకు తెలిసింది డాడ్ అనడంతో మహేంద్ర ఒకసారిగా షాక్ అవుతాడు. అప్పుడు మహేంద్ర అసలు విషయం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా రిషి వినిపించుకోకుండా గౌతమ్ ని మరింత అపార్థం చేసుకుంటూ ఉంటాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel