Google Pay : యూజర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న గూగుల్ పే … నిమిషాల వ్యవధిలో లక్ష రూపాయల లోన్ !

Google Pay : ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ పేమెంట్లు వినియోగం బిగా పెరిగింది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సర్వీసులను పొందుతున్నారు. ఇక డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ద్వారా సులభంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు తాజాగా యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు గూగుల్ పే తమ యూజర్ల కోసం బంపర్ ఆఫర్ అందిస్తుంది.

అందుకోసం గూగుల్ పే యూజర్లకు డిజిటల్ పర్సనల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా రూ. లక్ష వరకు పర్సనల్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ పొందాలంటే గూగుల్ పే యూజర్లు తప్పనిసరిగా క్రెడిట్ స్కోరు కలిగి ఉండాలి. ఈ క్రెడిట్ స్కోరు ఆధారంగానే గూగుల్ పే తమ యూజర్లకు లక్ష వరకు లోన్ అందిస్తోంది. గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు DMI Finance అనే కంపెనీ ద్వారా డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్స్ తీసుకొచ్చింది.

Advertisement

ఈ లోన్ ఆఫర్ అర్హత కలిగిన యూజర్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ మొత్తాన్ని 36 నెలలు లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లోన్ ఆఫర్ అందరికి వర్తించదు. మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి, క్రెడిట్ స్కోరు బాగుంటేనే పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. మీరు కూడా పర్సనల్ లోన్ కోసం చూస్తున్నట్లైతే ఈ పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసుకోండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel