Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.30 మేర తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ. 430 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.66,850 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,380గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,380గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,850గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,380గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉంది. కిలో వెండి ధర రూ.66,850గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,380గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉంది. కేజీ వెండి ధర రూ.66,850గా వద్ద కొనసాగుతోంది
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,380గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉంది. కేజీ వెండి ధర రూ.66,850వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1898 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.56 డాలర్లుగా ఉంది.

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel