Ginna Movie : ఆకట్టుకుంటున్న జిన్నా టీజర్.. హర్రర్ స్టోరీతో భయపెట్టబోతున్న మంచు విష్ణు!

Updated on: September 9, 2022

Ginna Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి పరిచయం అవసరం లేదు.ఇక ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తరచూ సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆయన సినిమాలు పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నాయి. తాజాగా నటించిన మోసగాళ్లు సినిమా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది. ఇక తన తదుపరి చిత్రం జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇషాన్ సూర్య దర్శకుడుగా పరిచయం కాబోతూ ఈ సినిమా తెరకెక్కుతోంది.

ginna-movie-impressive-jinna-teaser-manchu-vishnu-is-going-to-scare-with-horror-story
ginna-movie-impressive-jinna-teaser-manchu-vishnu-is-going-to-scare-with-horror-story

ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఇందులో మంచు విష్ణు టెంట్ ఓనర్ గా కనిపించబోతున్నారు.జిన్నా టైంకు రావడంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తుంటాడు అంటూ విష్ణు క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే విష్ణు పాత్రను ఎలాంటి బాధ్యత తెలియని పాత్రగా చూపించారు. ఈయన ఏ పని చేయకుండా ఊరంతా అప్పులు చేస్తూ తిరుగుతూ ఉన్నటువంటి ఈయన జీవితంలోకి సన్నిలియోన్ ఎంట్రీ ఇస్తారు. అయితే టీజర్ లో ఆమెకు దయ్యం పట్టినట్టు చూపించారు. మరి ఆ దయ్యం వెనుక ఉన్న స్టోరీ ఏంటి అనేది సినిమా.

Ginna Movie : జిన్నా టీజర్.. 

ఇక సన్నీ లియోన్ కి దయ్యం పట్టడంతో ఆ దయ్యం వెనుక ఉన్న స్టోరీ ఏంటి దానిని ఎలా చేదించారు అనేది సినిమా కథాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే ఈసారి మంచు విష్ణు కచ్చితంగా హిట్టు కొట్టేలాగే ఉన్నారని అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో మంచో విష్ణు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel