Actress: జిమ్ లో భారీ వర్కవుట్ లతో అదరగొడుతున్న మరో బ్యూటీ ఎవరో తెలుసా..?

Updated on: June 5, 2022

Actress: ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వాతావరణ మార్పులు, రోజువారి జీవన శైలి వల్ల అంతుపట్టని వ్యాధులు దరి చేరుతున్నాయి. వాటిని అరికట్టే ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా సూచనలు పాటిస్తున్నారు. అయితే అందం తో పాటు, ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం తప్పనిసరి. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే తప్పకుండా పాటించవలసిందే. అందుకే చాలా మంది సినీ తారలు కసరత్తులు చేస్తూ జిమ్ముల్లో కనిపిస్తుంటారు.

ఈ మధ్య కాలంలో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వారికి సమానంగా వర్కవుట్ లు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రస్తుతం సమంత, రకుల్ ప్రీత్ లాంటి వారు ముందంజలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మరో సినీ తార కూడా వచ్చి చేరింది. జిమ్ లో భారీ వర్కవుట్ లు చేస్తూ అందరి కంటా పడింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ప్రేక్షకులను అలరించిన రాశీ కన్నా.

మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి, అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే తాజాగా ఈమె కూడా నిపుణుల వర్యవేక్షణలో తగిన సూచనలు పాటిస్తూ, కసరత్తులు చేస్తోంది. తెలుగులో పలు హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో చేసి తన టాలెంట్ ను నిరూపించుకుంటోంది ఈ భామ. సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్యతో కలసి థాంక్యూ సినిమాలో నటించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel