Karthika Deepam january 06 Today Episode : మోనితని చంపేస్తానని బెదిరించిన కార్తీక్.. మోనితపై సీరియస్ అయిన దీప?

Updated on: January 6, 2023

Karthika Deepam january 06 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనితని దీప మెడబట్టి బయటకు గెంటేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దీప వంట చేస్తూ మోనిత అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి దీప దీప అని పిల్చడంతో ఏం ఆలోచిస్తున్నావు అనగా ఏం లేదు డాక్టర్ బాబు అంటుంది. అప్పుడు కార్తీక్ నిన్ను వంటగదిలోకి రావద్దని చెప్పాను కదా. పైగా స్టవ్ ముందు పరధ్యానంతో నిలబడి ఉన్నావు అని అంటాడు. అప్పుడు నువ్వు బయటికి వెళ్ళు నేను వంట చేస్తాను అని కార్తీక్ అనగా పర్లేదు డాక్టర్ బాబు ఈ ఒక్కసారికి ఏం కాదు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి నాకు అంత అయోమయంగా ఉంది అంటుంది దీప. బతికినన్ని రోజులు సంతోషంగా బతుకుదామని అనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు ఆ సంతోషాన్ని ఇవ్వలేదు అనడంతో మోనిత గురించి ఆలోచిస్తున్నావా అంటాడు కార్తీక్.

Karthika Deepam january 06 Today Episode
Karthika Deepam january 06 Today Episode

అది జైలుకు వెళ్ళింది మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ వచ్చింది మరి దాని గురించి ఎలా ఆలోచించకుండా ఉండాలి దాని పీడ ఎలా విరగడ అవుతుందో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది దీప. నువ్వు మోనిత గురించి ఆలోచించొద్దు తన అడ్డు ఎలా తొలగించుకోవాలో నేను చూసుకుంటాను అంటాడు కార్తీక్. ఏం చేస్తారు డాక్టర్ బాబు అది జైల్లో ఉన్నప్పుడే చారుశీలను పెట్టి మన విషయాలు అన్నీ కనుక్కుంది ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు చనిపోతానా అని నా చావు కోసం ఎదురు చూస్తోంది అని అంటుంది దీప. అప్పుడు ఆ మోనితకు నువ్వు లేకుంటే నేను ఉండలేను అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెబుతాను అనడంతో డాక్టర్ బాబు మీకు దండం పెడతాను ఆపండి పదేపదే అలా మాట్లాడకండి అంటుంది దీప. తర్వాత కార్తీక్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

అప్పుడు దీప మోనిత గురించి తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మోనిత ఒకచోటికి వెళ్ళగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ రావడంతో సంతోషంగా నాకోసం నువ్వు వచ్చావా కార్తీక్ అని అంటుంది. నీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అంటాడు కార్తీక్. లోపలికి వెళ్దాం రా కార్తీక్ అనడంతో అవసరం లేదు ఇక్కడే మాట్లాడుతాను అని అనగా మోనిత సిగ్గుపడుతూ ఇదే ఇంట్లో నీకు గతం గుర్తు రాకముందు ఇద్దరము ఎంత సంతోషంగా గడిపామో గుర్తు తెచ్చుకో అని అంటుంది. నన్ను కూడా నీ మనిషిలా ఫీలవు అనడంతో మాట్లాడకు మోనిత నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదా అని అంటాడు. అప్పుడు మోనిత అలాగే మాట్లాడడంతో నువ్వు మనిషివేనా ఇలా మాట్లాడగలుగుతున్నావు అని అనగా నువ్వు ఏం చేసినా నేను ఇలాగే మాట్లాడుతాను కార్తీక్ అంటుంది మోనిత.

అప్పుడు మోనిత నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అందుకు ఒక కండిషన్ నేను మీతో పాటు కలిసి ఉంటాను. దీప బతికినన్ని రోజులు దీప తో ఉండు దీప చనిపోయాక నాతో సంతోషంగా ఉండు అంటుంది మోనిత. నీ బుద్ధి మారదు అని తెలిసి నీతో మాట్లాడడానికి వచ్చే నాకు బుద్ధి లేదు ఛీఛీ అంటాడు కార్తీక్. ఇప్పుడు దీప కండిషన్ బాగాలేదు కాబట్టి నేను మర్యాదగా వదిలేస్తున్నాను కానీ నీ వల్ల తనకు ఏమైనా హాని జరిగిందో ప్రాణాలు తీసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. మరొకవైపు సౌర్య, హిమ ఇద్దరు కార్తీక్ దీప లను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సౌర్యకి దాహంగా అనిపించడంతో హిమ తనకు దాహం వేస్తుందని అబద్ధం చెప్పి వాటర్ బాటిల్ తీసుకుంటుంది.

సౌర్య హిమ తాగిన నీళ్లు కాకుండా మరొక వాటర్ బాటిల్ తీసుకుంటుంది. సరే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరొకవైపు దీప,ఇంటికి మోనిత వెళ్తుంది. డాక్టర్ బాబు ఇంకా రాలేదా అనడంతో నీకెందుకే ఫస్ట్ నువ్వు బయటికి వెళ్తావా లేదా అని అంటుంది. ఇదిగో ఇలా ఆవేశపడే నువ్వు జీవితంలో చాలా నష్టపోయావు అని అంటుంది మోనిత. సరే ఇప్పుడు నేను చెప్పేది విను కార్తీక్ నా దగ్గరికి వచ్చాడు. దీప ఇప్పుడు ఆఖరి క్షణాల్లో ఉంది కనీసం ఇప్పుడైనా తనని ప్రశాంతంగా బ్రతకనివ్వు అని నన్ను బ్రతిమలాడాడు అని అంటుంది మోనిత. అప్పుడు దీప సీరియస్ అయినా కూడా మోనిత అలాగే మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు సౌర్యహిమ రోడ్డుపై దీప కార్తీక్ ల కోసం వెతుకుతుండగా మీకు ఎంతటి కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు హేమచంద్ర.

Advertisement

Read Also : Karthika Deepam: కార్తీక్ ఇంటికి వెళ్లిన సౌందర్య.. దీప చేసిన దోసకాయ పచ్చడి తిన్న హిమ?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel