Karthika Deepam Aug 31 Today Episode : డాక్టర్ బాబును తన వైపు తిప్పుకోవడానికి మళ్లీ వంటలక్కగా మారిన దీప..?

Updated on: August 31, 2022

Karthika Deepam Aug 31 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప,మోనిత పై ఫైర్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో దీప, డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉండగా అప్పుడు మోనిత మాత్రం ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం వస్తారు అని అనడంతో వెంటనే దీప నేను నా మాంగల్యం కోసం వచ్చాను అంటూ తాళిని చూపిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ కి గతంలో జరిగినదంతా వివరిస్తుంది. ఇప్పుడు కార్తీక్ తల పట్టుకుని ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెంటనే మోనిత ఇక్కడ కార్తీకి గతం గుర్తుకొస్తుందేమో అన్న భయంతో డ్రైవర్ శివ కి చెప్పి దీప ని బలవంతంగా బయటికి గెంటేస్తుంది.

Karthika Deepam Aug 31 Today Episode
Karthika Deepam Aug 31 Today Episode

ఆ తర్వాత కార్తీక్ ని ఇంట్లోకి పంపిస్తుంది. ఆ తర్వాత శివ నువ్వు వెళ్లి టాబ్లెట్ తీసుకొని రా దీని సంగతి నేను చూస్తాను అని అనగా వెంటనే దీప ఏం టాబ్లెట్లు అని అడగడంతో, మీరు ఎవరు గుర్తుకు రాకుండా గతం గుర్తుకు రాకుండా నేను టాబ్లెట్లు ఇస్తున్నాను అని అనడంతో దీపా షాక్ అవుతుంది. ఆ తర్వాత దీప ఎలా అయినా నా డాక్టర్ బాబుకు గతం గుర్తుకు వస్తుంది. మా ప్రేమ మా ఇద్దరినీ ఒకటి చేస్తుంది.

స్వయంగా నువ్వే నా డాక్టర్ బాబుని నా దగ్గర వదిలి సన్యాసం అవతారం ఎత్తుతావు అంటూ మోనిత తో శపథం చేస్తుంది దీప. ఇంతవరకు ఎదురుచూస్తూ ఉండు అలాగే నా డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకో అంటూ మోనిత కీ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది దీప. ఆ తర్వాత కార్తీక్ జరిగిన విషయాన్ని తలుచుకునే ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

Karthika Deepam Aug 31 Today Episode : మళ్లీ వంటలక్క గా మారిన దీప..

ఇంతలో మోనిత అక్కడికి వచ్చి దీపా గురించి నెగటివ్ గా చెబుతుంది. కానీ కార్తీక్ మాత్రం మోనిత మాటలు నమ్మడు. మరొకవైపు డాక్టర్ బాబు ఇంటికి చేరుకున్న వంటలక్క జరిగిన విషయాన్ని వాళ్ళ డాక్టర్ అన్నకు, వాళ్ళ అమ్మకు వివరిస్తుంది. అప్పుడు దీప డాక్టర్ అన్నయ్యతో టాబ్లెట్లతో గతం మర్చిపోతారా అని అడగగా, అలాగైతే మర్చిపోవడానికి కొన్ని రకాల టాబ్లెట్లు ఉన్నాయి అని చెబుతాడు.

మరి గతం రావడానికి ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా అని దీప అడగగా,అప్పుడు వెంటనే అతను నీ దగ్గర ప్రేమ అనే మందు ఉంది ఆ ప్రేమతో డాక్టర్ బాబు దగ్గర చేసుకోవచ్చు అంటూ దీపకు ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత కావాలనే మోనిత చేతికి గాయం చేసుకొని కార్తీక్ దగ్గర రొమాంటిక్ గా నటించాలని వెళ్తుంది. కార్తీక్ వైపు అలానే చూస్తూ ఉంటుంది మోనిత. రేపటి ఎపిసోడ్ లో దీప,మోనిత ఇంటి పక్కలో సెటిల్ అయ్యి అక్కడ బిర్యాని చేస్తూ ఉంటుంది. బిర్యానీ వాసనకు కార్తీక్ తో పాటు మోనిత కూడా అక్కడికి వెళుతుంది. కార్తీక్ రావడం చూసి దీప సంతోషపడుతుంది.

Read Also : Karthika Deepam Aug 30 Today Episode : నా డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకో అంటూ మోనితకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన వంటలక్క..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel