Karthika Deepam Aug 30 Today Episode : నా డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకో అంటూ మోనితకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన వంటలక్క..?

Karthika Deepam Aug 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప సౌందర్య వాళ్ళ గురించి తలుచుకుని బాధపడుతూ ఎలా అయినా కార్తీక్ ని వెతికి పట్టుకోవాలి అని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ నిద్రపోతూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి దీప గురించి ఆలోచిస్తూ, ఆ దీప ఆక్సిడెంట్ లో చనిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ నీ ఫోటో పట్టుకొని రోడ్లపై తిరుగుతోంది. ఈసారి నిన్ను ఎలా అయిన దక్కించుకుంటాను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మోనిత. మరొకవైపు సౌందర్య ఏదో ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో మోహిత గురించి మాట్లాడుతూ మోనిత విషయంలో నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అని అంటుంది.

Advertisement
Karthika Deepam Aug 30 Today Episode
Karthika Deepam Aug 30 Today Episode

ఎందుకు టెన్షన్ అని ఆనందరావు అనడంతో మనం అంటే శౌర్య కోసం అక్కడికి వెళ్ళాము కానీ ఆ మౌనిత అక్కడికి ఎందుకు వచ్చింది సౌర్యం ఏదైనా చేయాలి అనుకుంటుందా అంటూ మోనిత విషయంలో భయపడుతూ ఉంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్యకు ఆనందరావ ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా సౌందర్య మాత్రం మోనిత విషయంలో భయపడుతూనే ఉంటుంది. మరొకవైపు కార్తీక్ అతని డ్రైవర్ శివ కారులో వెళుతూ ఉండగా అప్పుడు శివ,మోనిత కు ఫోన్ చేసి మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు చెప్తాను అని అనటంతో కనీసం ఇప్పుడైనా మనశాంతిగా ఉండనివ్వవా అని అతనిని తిడతాడు కార్తీక్.

Advertisement

ఆ తర్వాత కార్తీక్ శివ మీద కోపంతో నేను మీ కారులో రాను అంటూ కోపంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇంతలో అటుగా దీప ఆటోలో వస్తూ ఉంటుంది. అప్పుడు శివ కార్తీక్ ని రోడ్డుపై బ్రతిమలాడుతూ ఉండగా అది చూసిన దీప డాక్టర్ బాబు అంటూ గట్టిగా అరుచుకుంటూ అక్కడికి వస్తుంది. ఇంతలోనే కార్తీక్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోవడంతో వెంటనే దీప ఆటోలో కార్తీక్ ఆటోని ఫాలో అవుతుంది. అప్పుడు దీప, వాళ్ళ డాక్టర్ అన్నకి ఫోన్ చేసి నేను నా భర్తను తీసుకుని వస్తున్నాను అని అమ్మకు చెప్పు అని అంటుంది.

Advertisement

Karthika Deepam Aug 30 Today Episode : మోనితకు వంటలక్క స్వీట్ వార్నింగ్ ..

మరొకవైపు శౌర్య ఆటో వెనకాల అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అన్న రాసిన దాన్ని చూసి ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వారణాసి రావడంతో వారణాసిని చూసి మొదటి సంతోష పడిన సౌర్య సౌందర్య వాళ్ళు పంపించారు అనుకుని అతన్ని తిడుతుంది. ఆ తర్వాత వారణాసి లేదు అని నిజం చెప్పడంతో ఇంతలో ఇంద్రమ్మ దంపతులను పిలిచి మా మామయ్య వారణాసి అని వాళ్లకు పరిచయం చేస్తుంది. మరొకవైపు దీప, కార్తీక్ మీ ఫాలో అవుతూ వెళ్తుంది. కార్తీక్,మోనిత బట్టల షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దీప వెళ్లి డాక్టర్ బాబు, డాక్టర్ బాబు అని పిలవగా నేను మీ డాక్టర్ బాబుని కాదు.

Advertisement

మీరు ఎవరో భ్రమ పడుతున్నారు అని అనడంతో ఇంతలోనే మోనిత ఎవరు కార్తీక్ అనే బయటకు రావడంతో దీపావ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు దీప అసలు విషయం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా మోనిత మాత్రం అదొక పిచ్చిది దాని మాటలు నమ్మొద్దు అని అంటుంది. అప్పుడు మోనిత మీద అనుమాన పడిన కార్తీక్, నువ్వు ఆవిడని చూడలేదు పిచ్చిది అంటున్నావు మరి నీ పేరు ఆమెకు ఎలా తెలుసు నీ గురించి తెలిసింటే,తప్పకుండా నా గురించి కూడా తెలుస్తుంది కదా అని కార్తీక్ అనడంతో వెంటనే మోనిత,శివ ని ఆమెను బయటకు గింటేయ్ అని చెప్పడంతో కార్తీక్ వద్దు శివ అని అడ్డుకుంటాడు.

Advertisement

అప్పుడు మోనిత ఇలాంటి వాళ్ళందరూ డబ్బు కోసం ఆశపడి ఇక్కడికి వస్తారు అని అనటంతో, వెంటనే దీప నేను డబ్బు కోసం రాలేదు నా మాంగల్యం కోసం వచ్చాను అంటూ కార్తీక్ ముందు తన తాళిబొట్టును బయటపెడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప,మోనిత దగ్గరికి వెళ్లి నన్ను నా డాక్టర్ బాబు నీ మా బంధమే కలుపుతుంది అంతవరకు నువ్వు నా డాక్టర్ బాబు ని జాగ్రత్తగా చూసుకో అంటూ మోనిత కు స్వీట్ గా వార్నింగ్ ఇస్తుంది దీప.

Advertisement

Read Also : Karthika Deepam Aug 29 Today Episode : మోనిత పై మండిపడ్డ కార్తీక్.. సౌందర్య కి ఫోన్ చేయాలి అనుకుంటుంన్న దీప..?

Advertisement
Advertisement