Balakrishna: టర్కీలో ఫ్యాన్స్ తో కలసి భోజనం చేసిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో?

Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్సన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించాడు. వయసు పెరిగే కొద్దీ బాలకృష్ణలో ఉత్సాహం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

సాధారణంగా బాలకృష్ణ ఒక ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. చాలా సందర్భాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ పైన చేయి చేసుకోవడం చూసి కొంతమంది ఆయనకు ఆవేశం ఎక్కువ అనుకుంటూ ఉంటారు. కానీ బాలకృష్ణ గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే ఆయన మంచితనం గురించి తెలుసు. చాల సందర్భాలలో బాలకృష్ణ తన మంచి మనసు చాటుకున్నాడు. ఆపదలో ఉన్న అభిమానులను ఆదుకోవడమే కాకుండా ఇటీవల తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం కూడా చేశాడు. అయితే ఇటీవల షూటింగ్ కోసం టర్కీ వెళ్ళిన బాలయ్య అక్కడ కూడా ఇలాంటి పని చేశాడు.

Advertisement

Balakrishna:

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన బాలకృష్ణ అక్కడ ఒక కుటుంబంతో కలిసి టిఫిన్ చేసి వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బాలకృష్ణ ఒక కుటుంబంతో ఒక కుటుంబంతో కలిసి టిఫిన్ చేసి వారితో సరదాగా మాట్లాడుతూ… హే భాయ్ టిఫిన్ చేశారా అని అడిగి కబుర్లు చెబుతూ ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని టీవీ సీరియళ్లు చూస్తూ మెదడు పాడు చేసుకుంటారు. అంటే నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది అని వివరించాడు. అసలు టీవీ చూడకపోతే మెదడుకి మంచిదని సరదాగా మాట్లాడారు. తర్వాత చాయ్ తాగారా? అని అడిగి ఇక్కడ క్యాపిచ్చినో బాగుంటుందని చెబుతూ అభిమానులతో ముచ్చటించినటువంటి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel