Karthika Deepam : కార్తీకదీపంలో హైలెట్ సీన్.. రంగంలోకి దిగిన డాక్టర్ కార్తీక్!

Updated on: February 2, 2022

Karthika Deepam Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్, దీప.. సౌర్య గురించి బాగా బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్లో ఎవరు ముందుకు రాకపోవటంతో కార్తీక్ తానే స్వయంగా తన కూతురికి చిన్న ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక తన క్యాబిన్ లో కూర్చున్న డాక్టర్ అక్కడ సీసీ ఫుటేజీ ఆధారంగా కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆశ్చర్యపోతూ ఉంటుంది.

Karthika Deepam Feb 2 Episode Today
Karthika Deepam Feb 2 Episode Today

కార్తీక్ ఎవరికీ కనిపించకుండా దీప వాళ్లను అడ్డుగా ఉండమంటాడు. దాంతో అక్కడ ఉన్న నర్సు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారని.. మీరు ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటారని గట్టిగా ప్రశ్నిస్తుంది. వెంటనే తనకు మరో పేషెంట్ సీరియస్ గా ఉందని తెలియడంతో అక్కడి నుంచి వెళ్తుంది. కార్తీక్ ఎలాగైనా తన కూతుర్ని రక్షించుకోవాలని తాపత్రయ పడుతుంటాడు.

అంతలోనే డాక్టర్ వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని కార్తీక్ వాళ్ళను అడిగి అక్కడ ఉన్న స్టాఫ్ పై అరుస్తుంది. మరోవైపు మోనిత.. ఆదిత్య, శ్రావ్య వాళ్లకు ఎదురుపడుతుంది. ఇక తన మాటలతో వాళ్లను బాగా రెచ్చగొడుతుంది. ఆదిత్య కూడా తనపై గట్టిగా అరుస్తాడు. అయినా కూడా మోనిత తను ఆ ఇంటికి దేవుడిచ్చిన కోడల్ని అంటూ గట్టిగా మాట్లాడుతుంది. మరో పదిరోజుల్లో కార్తీక్, బాబులతో మీ ముందు ఉంటానని మాట ఇస్తుంది.

Advertisement

Karthika Deepam Feb 2 Episode Today : డాక్టర్ బాబు ఏం చేయబోతున్నాడు..  నేటి ఎపిసోడ్ అసలే.. మిస్ కావొద్దు..!

ఇక రుద్రాణి కూడా కార్తీక్, దీపల గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని తన మనుషులను అడుగుతుంది. వారిని ఎలాగైనా పట్టుకుంటానని.. అందులో హిమను తన సొంతం చేసుకుంటానని.. తాడికొండ గ్రామానికి మరో రుద్రాణిని తయారు చేస్తానని గట్టిగా అంటుంది. ఇక హాస్పిటల్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్, దీప.. డాక్టర్ తో తమ పరిస్థితులు చెప్పుకొని బాధపడతారు.

ఇక డాక్టర్ దీప వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకొని ఆపరేషన్ చేయిస్తానని అంటుంది. అదే సమయానికి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉండటంతో అతడు ఈ కేసు చాలా సీరియస్ అని అంటాడు. ఇక ఇంతకు ముందు సర్జరీ జరిగింది అనుకుంటా అని అనడంతో.. డాక్టర్ కార్తీక్ చేశాడని కార్తీక్ అంటాడు. ఆ మాట విని డాక్టర్లు షాక్ అవుతారు. గ్రేట్ డాక్టర్ అని అంటారు. కానీ ఈ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ అయితేనే చేస్తాడు అని అంటాడు. తరువాయి భాగంలో కార్తీక్ ధైర్యం తెచ్చుకొని మళ్లీ డాక్టర్ కోటు వేసుకుని రంగంలోకి దిగుతాడు.

Read Also : Karthika Deepam : నా కూతురిని కాపాడు అంటూ డాక్టర్ బాబు కాళ్ళు మొక్కిన దీప!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel