Anchor anasuya: జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది కమెడియన్లు జీరో స్థాయి నుంచి హీరోలుగా ఎదిగారు. అలాగే యాంకర్ అనసూయ, రష్మి వంటి వాళ్లు కూడా టాప్ యాంకర్లుగా మారింది ఈ షో వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంత కాలంగా ఈ షో నుంచి చాలా మంది వెళ్లిపోతున్నారు. ముందుగా నాగబాబు వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆయనతో పాటు చాలా మంది కమెడియన్లు తనతో తీసుకెళ్లిపోయాడు. తాజాగా సుధీర్, గెటప్ శ్రీను వంటి వాళ్లు కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు. త్వరలోనే అనసూయ కూడా వెళ్లిపోనుందంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ వాటిపె ఆమె స్పందించలేదు.
కానీ తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే మాత్రం అనసూయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చలాకీ చంటి స్కిట్ లో అనసూయకు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత తాగుబోతు రమేష్ అయితే అనసూయ మీద స్కిట్టే చేశాడు. అనసూయ గెటప్ వేసిన రమేష్.. ఎమోషనల్ డైలాగుతో కంటెస్టెంట్లను, జడ్జి ఇంద్రజలను కన్నీళ్లు పెట్టించాడు. చంటి పిల్లలు ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ చేసిన మీరు ఎందుకు వెళ్లిపోతున్నారు జోక్ చేయకండి అంటూ కామెంట్ చేశారు. కానీ నిజంగానే తాను వెళ్లిపోతున్నట్లు చెప్పడంతో ఇంద్రజ అనసూయను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది.