Health Tips: పంటి నొప్పి వేధిస్తోందా? ఈ చిట్కాలతో నిమిషాలలో పంటి నొప్పి మాయం..!

Updated on: March 13, 2022

Health Tips: దంతాలు, మనిషి ఏమి తిన్నా సరే వాటిని నమిలి మింగడానికి ఉపయోగపడతాయి. మనిషి నవ్వును ప్రతిబింభ పరుస్తాయి. చాలా మంది దంతాలను చాలా జాగ్రతగా కాపాడుకుంటారు. కొంత మంది దంతాల మీద అశ్రద్ద చేయడం వల్ల దంతాల రంగు మారి, పచ్చ రంగులోకి మారిపోతాయి. దీనితో నలుగురిలో నవ్వులి అన్నా కూడా మొహమాట పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎల్లప్పుడూ దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మనం తినే ఆహారం నమిలి మింగడానికి ఉపయోగపడే ఆయుధాలే దంతాలు. దంతాలకు దెబ్బలు తగలడం వల్లనో, ఏది పడితే అది తినడం వల్లనో దంత సమస్యలు ఏర్పడతాయి. దీనితో ఒక్క పన్ను కి నొప్పి మొదలైన కూడా అది చాలా విపరీతంగా బాధ కలుగుతుంది.

దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, దంతాల లో పగుళ్ళు, కొత్త దంతాలు రావడం, చిగుళ్ల సమస్యలు, దంతలలో పగుళ్ళు ఏర్పడటం వల్ల నొప్పి మొదలవుతుంది. పంటి నొప్పి ఒకసారి మొదలైతే అది డెంటిస్ట్ వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునే వరకు తగ్గదు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల నొప్పి నుండి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.

• పంటి నొప్పితో బాధపడే వారికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. విపరీతమైన పంటి నొప్పి వచ్చినవారు వెల్లుల్లిని బాగా దంచి అందులో కాస్త ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల పళ్ళల్లో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు పంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
• ఒక ఐస్ ముక్కని ఒక క్లాత్ లో తీసుకొని నొప్పి ఉన్న చోట దవడ మీద పెట్టడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయటం వల్ల రక్తనాళాలు, రక్త ప్రసరణ మెరుగుపడతాయి. ముఖ్యంగా వాపు కారణంగా వచ్చే పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
• పూర్వం నుండి పంటి నొప్పులకు మన పెద్దలు ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి బాగా పుక్కిలించేవారు. ఇలా చేయడం వల్ల నోటిలోని ఇన్ఫెక్షన్ తగ్గి పంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇది మీ దంతాల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్స్ కు కారణమైన క్రిములను చంపగలిగే శక్తి వస్తుంది.
• పంటి నొప్పి ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో లవంగం నూనె రాయటం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel