Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాలుగో వారంలో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే…ఎలిమినేట్ అయ్యేది తన?

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ షో తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొంది ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది.ఇప్పుడు ఓటీటీ వేదికగా వస్తున్న బిగ్ బాస్ షో 24/7 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. కొత్త కొత్త టాస్క్ లతో కంటెస్టెంట్ ల మధ్య భారీగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ షో బిగినింగ్ లో 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో కి అడుగు పెట్టగా.. గడిచిన మూడు వారాలలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రారంభమైన నాలుగోవ వారంలో ఏడు మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. మొదటి నుండి బిందుమాధవి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

యాంకర్ శివ రెండో ప్లస్ లో ఉండగా.. అజయ్ తన పర్ఫార్మెన్స్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా గతంలో టాప్ వన్ లో అరియాన ఈసారి నాలుగో ప్లేస్ లో ఉంది. సరయు ఐదో స్థానంలో ఉండగా. మిత్రశర్మ, అనిల్ రాథోడ్ చివరి రెండు స్థానాలలో ఉన్నారు. ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతారు. కాకపోతే చిన్న కారణం చేత అయినా కూడా ఓటింగ్ తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఈ వారం చివరి దాకా వేచి చూడాల్సిందే.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel