Anchor Suma: సుమక్కకే చుక్కలు చూపించిన బుల్లితెర జంటలు…వీళ్ళు మామూలోల్లు కాదు!

Updated on: March 17, 2022

Anchor Suma:సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఇలా బుల్లి తెరపై విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి దూసుకుపోతున్న క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శనివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.

ఎప్పటిలాగే సుమ తనదైనశైలిలో వారిపై పంచులు వేయడం తిరిగి వారు కూడా రివర్స్ పంచ్ వేస్తూ సుమకి చుక్కలు చూపించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వేసిన ప్రశ్నలకు మీరు చెప్పిన సమాధానాలు విన్న సుమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే సుమ ప్రశ్నలు అడుగుతూ.. సుమ నటించిన మొట్టమొదటి సీరియల్ ఏంటి అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సమాధానంగా కంటెస్టెంట్ అన్షు కౌంటర్ వేస్తూ మా జనరేషన్ కి సరిపోయే ప్రశ్నలు అడగండి అంటూ సమాధానం చెప్పారు.

Advertisement

ఈ విధంగా సుమ అడిగిన ప్రశ్నకు సుమకే కౌంటర్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. అంతేకాకుండా ఈ ప్రోమోలో కంటెస్టెంట్ ల చేత డైరెక్షన్ చేయించడం అలాగే రిలే నిరాహార దీక్షలు చేయించడం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సుమ ఒకవైపు బుల్లితెరపై బిజీగా ఉండటమే కాకుండా వెండితెరపై కూడా నటించడానికి సిద్ధమైంది. త్వరలోనే సుమ నటించిన జయమ్మ పంచాయతీ విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel