Rana Daggubati: ఆ విషయంలో రానాకు బాగా క్లాస్ పీకిన సూర్య… ప్రీ రిలీజ్ వేడుకలు అసలు విషయం బయట పెట్టిన రానా!

Updated on: March 4, 2022

Rana Daggubati: రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన డానియల్ శేఖర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఇదిలా ఉండగా రానా హీరో సూర్య నటిస్తున్న ఈటీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు ఈ సినిమా మార్చి 10వ తేదీ విడుదల కావడంతో హైదరాబాద్ లో నిన్న సాయంత్రం ఎంతో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రానా స్టేజ్ పై మాట్లాడుతూ సూర్య తనకు క్లాస్ పీకిన విషయం గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ నేను సూర్యగారికి
పితా మగన్ సినిమా నుంచి పెద్ద అభిమానిని. అప్పుడు ఆయన పేరు కూడా సరిగా తెలియదు.నేను హీరో అయిన తర్వాత నా సినిమాని ఎడిటింగ్ రూమ్లో చూసిన సూర్య తన కారులో ఎక్కించుకుని సుమారు నాలుగు గంటల పాటు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా తిప్పారని తెలిపారు. అయితే ఈ సమయంలోనే తనకు క్లాస్ పీకారు అనే విషయం చెబుతుండగా సూర్య వద్దని వారిస్తున్నా రానా ఆ విషయం గురించి బయట పెట్టారు.

ఇలా నన్ను నాలుగు గంటల పాటు కారులో ఎక్కించుకున్న సూర్య హైదరాబాద్ రోడ్లన్నీ తిప్పుతూ
బాబు నువ్వు చేసేది యాక్టింగ్ కాదు.. ఏదో తట్టి మేనేజ్ చేసేస్తున్నావ్ అంటూ బాగా క్లాస్ పీకారని ఆ రోజు అలా సూర్య క్లాస్ పీకటం వల్లే మీ ముందుకు ఒక బల్లాల దేవుడు, ఒక డానియల్ శేఖర్ వచ్చాడని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రానా సూర్యతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. సూర్య నటించిన ఈ సినిమా మార్చి 10వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel