Sudheer : ఆ సినిమా ఫలితాలతో ఇబ్బందుల్లో పడ్డ సుధీర్ కెరీర్..?

Updated on: August 25, 2022

Sudheer : జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ కి తెలుగులో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మాట్లాడుతూ తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఒక సినిమా కూడా ఉహించని విధంగా డిజాస్టర్ కావడంతో సుధీర్ కు తీవ్ర నష్టాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బుల్లితెరపై బాగానే క్రేజ్ ని ఏర్పరచుకున్న సుధీర్ కు వెండితెర అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు. ఇటీవల సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

sudigali-sudheer-unexpected-disaster-with-new-movie-wanted-pandugod
sudigali-sudheer-unexpected-disaster-with-new-movie-wanted-pandugod

ఆ తర్వాత నిదానంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి కూడా వెళ్లిపోయాడు. అంతే కాకుండా ఢీ షో నుంచి కూడా తప్పించుకున్న విషయం తెలిసిందే. కెరిర్ మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించిన సుధీర్ జబర్దస్త్ లో నెంబర్ వన్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న కమెడియన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇటీవల సుదీర్ నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమాను కొంచెం హైలెట్ చేస్తూ సినిమాని విడుదల చేసే ప్రయత్నం చేశారు.

అయితే దర్శకుడు రాఘవేంద్ర రావ్ దర్శకత్వం పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది అందరూ భావించినప్పటికీ ఉహించని విధంగా షాక్ ఇచ్చింది. కనీసం పెట్టుబడిని కూడా సినిమా వెనక్కి తీసుకురాలేకపోయింది. అయితే చాలా వరకు మొదటి రోజే థియేటర్ లు ఖాళీగా ఉండటంతో షోలను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా తర్వాత సుధీర్ నటించిన గాల్లోడు సినిమాను గ్రాండ్గా విడుదల చేయాలని అనుకున్నారట. కానీ పండుగాడ్ సినిమా డిజాస్టర్ కావడంతో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందట. అంతే కాకుండా మరొక రెండు ప్రాజెక్ట్ లు చర్చలో దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది..

Advertisement

Read Also : Gajuwaka Conductor : నేనట్టాంటి ఇట్లాంటి ఆడపిల్లను కాను బావో అంటూ దుమ్ము రేపిన బస్ కండక్టర్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel