Sami Sami Song Pushpa : పుష్ప నుంచి మరో సూపర్ సాంగ్.. ‘సామీ సామీ’ రిలీజ్!

Updated on: January 25, 2022

Sami Sami Song Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న కొత్త మూవీ పుష్ప (Pushpa) నుంచి ముచ్చటగా మూడో సాంగ్ వచ్చేస్తోంది. దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపించే బన్ని ఇప్పుడు పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు..

లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ వస్తోంది. ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పుష్ప మూవీ ప్రమోషన్స్‎లో భాగంగా ‘సామీ సామీ’ అనే (Sami Sami) అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 28న గురువారం ఉదయం 11:07 గంటలకు మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం పేర్కొంది.

Advertisement

మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో పుష్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, పుష్పకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే పుష్పలోని మూడో పాటకు సంబంధించి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ప్రోమోని రిలీజ్ చేశారు. ఇదివరకే పుష్ప మూవీ నుంచి శ్రీవల్లి, దాక్కొదాక్కొ మేక సూపర్ హిట్ పాటలు రిలీజ్ అయ్యాయి. దాక్కొదాక్కొ అనే పాటకు యూట్యూబ్‎లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. 10 మిలియన్లకు వ్యూస్ దాటేశాయి.
Read Also  : RRR దెబ్బకు వార్ వన్ సైడ్.. వచ్చే ఏడాది వరుసగా మూడు నెలల వరకు పండగే..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel