Samantha -Naga Chaitanya: ఆ డైరక్టర్ వల్ల ఒక్కటి కానున్న నాగచైతన్య సమంత…?

Samantha -Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచిన నాగచైతన్య సమంత కొన్ని నెలల క్రితం మనస్పర్ధలతో విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళ్ళింది. పెళ్లి జరిగిన కొంతకాలం వరకు ఎంతో సంతోషంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంట కొన్ని రోజుల క్రితం మనస్పర్ధల కారణంగా ఒకరికొకరు దూరమయ్యారు. అప్పటినుండి వీరిద్దరు వరుస సినిమాలో చేస్తూ షూటింగ్ లతో బిజీగా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల వీరిద్దరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం కావస్తోంది. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలవనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. సమంత నాగచైతన్య నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఏ మాయ చేసావే సినిమాకి సీక్వెల్ గా మరొక సినిమా ఉన్నట్లు ప్రకటించాడు. దీంతో సమంత నాగచైతన్య ఇద్దరు మళ్లీ కలవనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

samantha-comments-samantha-shocking-comments-on-naga-chaitanya

Advertisement

Samantha -Naga Chaitanya:

ఈ సినిమా సీక్వెల్ విషయమై గౌతమ్ మీనన్ సమంతని సంప్రదించగా ఆమె నాగచైతన్యతో కలిసి నటించటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమంతతో నటించాల్సి వస్తే ఆ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని నాగచైతన్య వెల్లడించాడు. ఈ సినిమా కోసం వీరిద్దరూ కలిస్తే మళ్లీ ఒక ట్రెండ్ సెట్ అవుతుంది. ఏ మాయ చేసావే 2 సినిమా కోసం వీరిద్దరూ కలిసి పని చేస్తే వీరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఏ మాయ చేసావే సినిమా సీక్వెల్ గురించి వార్త తెలియగానే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel