RGV Vyuham Movie : ‘వ్యూహం’ మూవీ రియల్ స్టోరీ ఇదేనట.. ఆర్జీవీ లెక్కల ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వర్మ టార్గెట్ ఎవరంటే?!

RGV Vyuham Movie : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరో సంచలనానికి తెరలేపాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘వ్యూహం’ అంటూ మరో మూవీతో వస్తున్నాడు. వివాదాలే తన కెరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్న వర్మ పొలిటికల్ లీడర్స్ తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ఏపీ పాలిటిక్స్‌ మరింత హీట్ పెంచేందుకు ఆర్జీవీ రంగంలోకి దిగాడు.

ఇటీవల సీఎం జగన్‌తో సమావేశమైన ఆర్జీవీ.. మరుసటి రోజునే రెండు మూవీలు తెరకెక్కించనున్నట్టు ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ రెండు మూవీలను కలిపి రెండు పార్టులుగా చేయనున్నాడు. అందులో ముందుగా వ్యూహం మూవీని తెరకెక్కించనున్నాడు. ఆ తర్వాత రెండో పార్టుగా శపథం మూవీని చేయనున్నట్టు వర్మ క్లారిటీ ఇచ్చాడు. పొలిటికల్ నేపథ్యంలో సాగే వ్యూహం ముందుగా చేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశాడు.

RGV Vyuham Movie : Tollywood sensational director ram gopal varma Reveals about vyuham movie story
RGV Vyuham Movie : Tollywood sensational director ram gopal varma Reveals about vyuham movie story

అది ఎంతమాత్రం బయోపిక్ కాదని కుండబద్దలు కొట్టేశాడు వర్మ. బయోపిక్ కన్నా అతి లోతైన రియల్ పిక్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. బయోపిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు.. కానీ, రియల్ పిక్‌లో వందకు వంద పాళ్ళు అన్ని నిజాలే ఉంటాయన్నారు. అహంకారాని‌కి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే ఈ వ్యూహం అంటూ ఆర్జీవీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రెండు భాగాల్లోనూ రాజకీయ అరాచకాలే ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రేక్షకులు ఫస్ట్ మూవీ షాక్‌ నుంచి తేరుకునేలోగా.. మరో ఎలక్ట్రిక్‌ షాక్‌ పార్ట్‌-2 రూపంలో తగులుతుందని వర్మ చెప్పుకొచ్చాడు. తాను గతంలో తీసిన ‘వంగవీటి’ సినిమా నిర్మాతే ఈ మూవీలకు నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

RGV Vyuham Movie : ఫస్ట్ పార్టుగా వ్యూహం.. రెండో పార్టుగా శపథం..

అంతటితో ఆగకుండా వర్మ మరో ట్వీట్‌లో వ్యూహం రియల్ స్టోరీ ఇదేనంటూ మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో అందరిలో వర్మ టార్గెట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. వర్మ ఈ మూవీకి సంబంధించి లెక్కల్ని ట్విట్టర్ వేదికగా రివీల్ చేశాడు. ‘BJP ÷ PK x CBN – LOKESH + JAGAN = వ్యూహం’ అంటూ కొత్త లెక్కల్ని వర్మ రివీల్ చేశాడు. ఇంతకీ వర్మ ఈ సినిమాతో ఎవరికి ఏం చెప్పనున్నారు? వర్మ మూవీతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

RGV Vyuham Movie : Tollywood sensational director ram gopal varma Reveals about vyuham movie story
RGV Vyuham Movie : Tollywood sensational director ram gopal varma Reveals about vyuham movie story

ఈ రెండు మూవీల్లో రాజకీయాలకు సంబంధించి అన్నింటిని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తానని చెప్పకనే చెప్పేశాడు వర్మ. తాను తీయబోయే రెండు సినిమాల్లో ఫస్ట్ పార్టులో జగన్ మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారనేది చూపించనున్నాడట. జగన్ అధికారంలోకి రాగానే ఆయన్ను గద్దె దించడానికి ఎవరు? ఎలాంటి వ్యూహాలు, పన్నాగాలు పన్నారనేది చూపించనున్నాడట.

అంతేకాదు.. జగన్‌ను అడ్డుకోవడానికి ఎలాంటి కుట్రలు కుతుంత్రాలు జరిగాయి అనేది కూడా ఫస్ట్ పార్టులో రాం గోపాల్ వర్మ అదే చూపించనున్నాడట.. బీజేపీని పవన్‌తో వాడుకుని, చంద్రబాబు తన బలం పెంచుకునేందుకు ఎలాంటి ఎత్తులు వేశారు.. అలాగే నారా లోకేష్ తీరు మైనస్ అయ్యిందంటూ అన్నీ కలిసి జగన్‌కు బాగా ప్లస్ అయ్యాయని వర్మ చెప్పుకొచ్చాడు.

Advertisement

వర్మ తీయబోయే ప్రత్యర్థి పార్టీల కుట్రపూరిత వ్యూహాలపైనే ఈ రెండు పార్టులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండింట్లో జగన్‌ను హీరోని చూపిస్తూ.. పవన్ కల్యాణ్, చంద్రబాబుని విలన్లుగా చూపించే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఈ రెండు సినిమాలతో రామ్ గోపాల్ వర్మ మున్ముందు ఎలాంటి ట్విస్టులు ఇవ్వనున్నాడో చూడాలి మరి.

Read Also : Samantha : బాబోయ్.. సమంత లైఫ్ ఇలా అయిపోయిందేంటి? చేతులారా తానే నాశనం చేసుకుందా?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel