Premi Viswanath: నిరుద్యోగులకు శుభవార్త… ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన వంటలక్క.. పోస్ట్ వైరల్..?

Premi Viswanath: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే ఈ సీరియల్ ముందు వరకు ప్రేమి విశ్వనాథ్ ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. కానీ కార్తీకదీపం సీరియల్ లో నటించి తన నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే ప్రేమి విశ్వనాథ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తాజాగా ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో పలు ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది. డ్రైవర్ అకౌంటెంట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కావాలని అందుకు అర్హతలు ఏంటి అన్న విషయాన్ని కూడా తన పోస్టులో వెల్లడించింది. డ్రైవర్ అకౌంటెంట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కావాలి అని తెలిపింది. అన్ని రకాల ఫోర్ వీలర్ డ్రైవర్లు కావలెను. ఇందుకు అర్హత వాహనాలు నడపడం వచ్చి ఉండాలి.

అదేవిధంగా అకౌంటెంట్ ఉద్యోగాలకు ట్యాలీ వచ్చి అభ్యర్థులు కావాలి వారికి రెండు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఈ ఉద్యోగాల కోసం ఎంపిక అయిన అభ్యర్థులు కొచ్చిలోని ఎర్నాకులంలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్ మాకు ఇంట్రెస్ట్ ఉంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమి విశ్వనాథ్ నటించిన కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందింది మనందరికీ తెలిసిందే. సీరియల్ బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో టాప్ వన్ రేటింగ్ దూసుకుపోతోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel